అంతర్జాతీయం

హిల్లరీకే అధ్యక్ష పీఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలడెల్ఫియా, జూలై 26: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశాలు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే పుష్కలంగా ఉన్నాయని, ఆమె కాబోయే అధ్యక్షురాలని వెర్మొంట్ సెనెటర్ బెర్నే సాండర్స్ స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీకే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. దేశాధ్యక్షుడికి ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు, శక్తి సామర్థ్యాలు హిల్లరీ క్లింటన్‌కు ఉన్నాయని సాండర్స్ పేర్కొన్నారు. డెమోక్రటిక్ జాతీయ సమావేశంలో మాట్లాడిన 71 ఏళ్ల సెనెటర్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వైట్‌హౌస్ దరిదాపుల్లోకి కూడా రాలేరని జోస్యం చెప్పారు. కాగా హిల్లరీ ఎన్నికల ప్రచారంలో సాండర్స్ కీలక భూమిక పోషిస్తున్నారు. లక్షలాది మంది మద్దతును కూడగట్టడంలోనూ మేనిఫెస్టో రూపకల్పనలోనూ ఆయనది క్రీయాశీలక పాత్ర. దేశాభివృద్ధి, బలమైన ఆర్థిక విధానాలు అమలుచేయగల సామర్ధ్యం హిల్లరీ సొంతమని సాండర్స్ తెలిపారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విద్వేషాలు రెచ్చగొడుతూ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్నారని సాండర్స్ ఆరోపించారు. ‘శే్వతజాతీయులు, నల్లజాతీయులు, లాటిన్, ఆసియన్-అమెరికన్, స్థానికులను కలుపుకొని పోయే చతురత, సామర్థ్యం హిల్లరీ సొంతం. ఆమెకు కచ్చితంగా అధ్యక్షపదవి దక్కుతుంది’ అని పేర్కొన్నారు.
‘పురుషుడా స్ర్తినా?, యువకులా, వయోజనులా?, గేనా మరొకరా? స్థానికులా వలసవచ్చినవారా? అన్నది పక్కనపెడదాం. దేశంకోసం పాటుపడే వ్యక్తికే పట్టం కడదాం’ అని హర్షధ్వానాల మధ్య సాండర్స్ ప్రకటించారు.