తెలంగాణ

‘గ్రేటర్’ ఎన్నికల ప్రక్రియ ఎలా కుదిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియను కుదించడానికి ముందు అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోకపోవడం అనైతికమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా మున్సిపల్ చట్టంలో సవరణలు చేసిందని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. టిఆర్‌ఎస్‌కు ఎన్నికల భయం పట్టుకున్నదని అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో యాడ్ ఏజెన్సీలను బెదిరించి హైదరాబాద్‌లో ప్రచార ఆర్భాటాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందడానికి ఎన్ని రకాల అక్రమాలు, చట్ట, న్యాయ విరుద్ధమైన పనులు చేస్తున్నదో ప్రజలు గమనించాలని ఆయన కోరారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయని, ఆ తర్వాత 200 డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందని, చివరకు 150 వార్డులనే కొనసాగించాలని నిర్ణయించిందని అన్నారు. డీ-లిమిటేషన్‌లో డివిజన్ల విభజన తమకు అనుకూలంగా ఉండేలా టిఆర్‌ఎస్ మార్పులు చేసుకున్నదని, సుమారు ఏడున్నర లక్షల మంది సెటిలర్ల ఓట్లను తొలగించిందని ఆయన తెలిపారు. దీనిని తాము కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళగా, ప్రభుత్వం గ్రేటర్ కమిషనర్‌ను మార్చిందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా సుమారు 18 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చి వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేయడంతో, తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, కోర్టులో కేసు వేసి వారి ఓటు హక్కుకు భంగం వాటిల్లకుండా చూశామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు 21 రోజుల గడువు ఉంటే తమ తప్పిదాలు బయటపడి ఓటమి పాలవుతామని భయపడి 15 రోజులకే ఎన్నికల ప్రక్రియను పరిమితం చేసిందని అన్నారు. రాజకీయ పార్టీలను సంప్రదించకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన విమర్శించారు. ఎన్నికల లబ్ది కోసం ఆచరణ సాధ్యం కానీ అనేక పథకాలను, కార్యక్రమాలను చేపడుతున్న టిఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా పాత్ర
ఒకటి, రెండు రోజుల్లో గ్రేటర్ ఎన్నికలకు మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికలలో సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. ప్రభుత్వం ప్రచారం చేస్తున్న అబద్దాలను తిప్పికొట్టి, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఈ మీడియా ద్వారా ప్రచారం చేయనున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.