రాష్ట్రీయం

గతుకుల నుంచి బతుకు బాటకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ఆర్టీసీ అంటేనే నష్టాల బండి. దేశంలో అత్యధిక మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్న ప్రభుత్వ సంస్థగా రికార్డు సాధించిన ఏపిఎస్ ఆర్టీసీ, ఇప్పుడు గతులకుల బాట నుంచి సరైన దిశలో బతుకు బాటవైపు పయనించడం అటు యాజమాన్యానికి, ఇటు ప్రయాణికులకు ఊరట కలిగిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపిఎస్ ఆర్టీసీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు సంస్థను హైటెక్ దిశగా నడిపిస్తున్నాయి. ప్రైవేటు సర్వీసులకు ధీటుగా ఆర్టీసీ ప్రేశపెడుతున్న కొత్త సర్వీసులలో ఆధునిక పోకడ దర్శనమిస్తున్నాయి. అమరావతి పేరుతో ప్రారంభించిన స్కానియో సర్వీసు ఆధునికంగా, లైవ్‌టీవీ, రెండు టివి స్క్రీన్లు ఉండటంతో ప్రజలు ప్రైవేటు సర్వీసులకంటే ముందు, అమరావతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనితో మరిన్ని సర్వీసులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. లగ్జరీ, సూపర్ లగ్జరీలోనూ లైవ్‌టీవీలు ప్రవేశపెట్టాలని యాజమాన్యం యోచిస్తోంది.
ఆర్టీసీని లాభాలబాటలో నడిపేందుకు ఖాళీగా ఉన్న స్థలాలను డెవలెప్‌మెంట్ కింద, స్విస్ చాలెంజ్ పద్ధతిలో లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి బాగా డిమాండ్ బాగా పెరిగింది. లీజులవల్ల భారీస్థాయిలో ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. నండూరి సాంబశివరావు ఏపిఎస్ ఆర్టీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల నష్టాలు తగ్గే పరిస్థితి ఏర్పడింది.
ఏ బస్సు ఎక్కడ ఉందన్న విషయం తెలుసుకునేందుకు విజయవాడలో తొలిసారి ప్రారంభించిన జీపీఎస్ విధానం, హైదరాబాద్-విజయవాడ ప్రయాణాలకు వేగం పెంచడం ద్వారా గంట సమయం ఆదా చేయడం, ఆక్యుపెన్సీ రేషియోను 2 శాతానికి పెంచడం, ఈ-వ్యాలెట్‌తో ప్రజలకు వందరూపాయల లాభం వచ్చే పథకం ప్రవేశపెట్టడం వంటి చర్యలు ఆర్టీసీని ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్నాయి. విభజన తర్వాత ఆర్టీసికి ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. గతంలో 68 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 70 శాతానికి చేరింది.
అయితే, పెద్ద బస్టాండ్లలో ప్రజలకు టాయిలెట్లకోసం డబ్బులు వసూలు చేస్తున్న విధానంపై మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదేవిధంగా పెద్ద నగరాలు, పట్టణాల్లో ఉన్న బస్టాండ్లలో షాపు యజమానులు దోపిడీకి దిగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయంటున్నారు.

తుని ఎమ్మెల్యేకు
ముందస్తు బెయిల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 27: కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా తునిలో రత్నాచల్ రైలు దగ్ధం కేసులో నిందితుడిగా ఉన్న తుని వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు అలియాస్ రాజాకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఎమ్మెల్యే తరఫున న్యాయవాది కె చిదంబరం వాదనలు వినిపిస్తూ తుని ఘటనలపై పోలీసులు 65 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారన్నారు. ఇందులో తమ పిటిషనర్ రాజాపై పది కేసులు నమోదు చేశారన్నారు. అన్ని కేసుల్లో ముద్రగడ పద్మనాభంను మొదటి నిందితుడిగా పేర్కొన్నారన్నారు. తన పిటిషనర్ తుని నియోజకవర్గం ఎమ్మెల్యే అయినందున కేసుల్లో నిందితుడిగా చేర్చారన్నారు. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినందువల్ల కేసులు బనాయించారన్నారు. కాగా ఆంధ్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు రాజాకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. తునిలో ఘటన జరిగిన రోజు అల్లర్లవెనక ఎమ్మెల్యే రాజా హస్తం ఉందన్నారు. కాగా ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించేందుకు అవసరమైన ఆధారాలు లేవని పేర్కొంటూ రాజాకు బెయిల్ మంజూరు చేశారు.

ఆరంభం అదిరిపోవాలి!
ప్రపంచం అంతా చర్చించుకోవాలి

దర్శకుడు బోయపాటితో ఏపి సిఎం చంద్రబాబు

విజయవాడ, జూలై 27: కృష్ణా పుష్కరాల ఆరంభం అద్భుతంగా ఉండాలని అధికారులు, సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌కు చంద్రబాబు ఆదేశించారు. ప్రపంచం అంతా అమరావతికి రావాలన్న భావన కలిగే రీతిలో పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని సిఎం సూచించారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను ఆయన బుధవారం తన నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడను ప్రపంచంలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కావల్సిన అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించిన పవిత్ర సంగామాన్ని ఒక ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దనున్నామని అన్నారు. పుష్కరాల ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ దేశమంతా దీని గురించి చర్చించుకునేలా ఉండాలని అన్నారు. పుష్కరాల ప్రారంభం రోజున ప్రకాశం బ్యారేజ్ వద్ద, కృష్ణా నదికి హారతి పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు సూచించారు. ఇందుకు సినీ దర్శకుడు బోయపాటి సూచనలను, సలహాలను ఆయన కోరారు. ఈ సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్, పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ, సమాచారశాఖ కమిషనర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం నుంచి నీరు విడుదలకు ఆదేశం
గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరు అవసరాలను తీర్చేందుకు శ్రీశైలం రిజర్వాయర్ కుడి కాలువ నుంచి నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి ఇబ్బంది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వెంటనే అధికారులు స్పందించాలని సిఎం సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎనిమిది టిఎంసిల నీరు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలియచేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.