తెలంగాణ

ఎర్రవల్లి ప్రజలూ సై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 28: మల్లన్నసాగర్ రిజర్యాయర్ నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతులకు రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిదని, వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో కొండపాక మండలం ఎర్రవల్లి ముంపు బాధితులు తమ భూములను మల్లన్నసాగర్ నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇచ్చేందుకు 60 మంది ముందుకు వచ్చి మంత్రికి తీర్మాన పత్రాలను అందించారు. ముంపు గ్రామాల్లో జీవన విధానాలు ఎలాగున్నాయో, అంతకంటే మెరుగైన విధంగా నిర్వాసితులకు సౌకర్యాలు, ఆవాసం కల్పించటానికి సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని హరీశ్‌రావు అన్నారు. జిఓ 123 ప్రకారం భూమి ఇచ్చేందుకు ముందుకు రానివారు కూడా వారు కోరుకుంటే 2013 చట్టం ప్రకారం న్యాయం చేస్తామన్నారు. జిఓ 123 ప్రకారమే భూసేకరణ త్వరగా జరుగుతుందని, ఎలాంటి కోర్టుల అడ్డంకులు ఉండవన్నారు. మెరుగైన నష్టపరిహారం అందుతుందన్నారు. సిఎం కెసిఆర్ ప్రజల మనిషి అనీ, ప్రజల కోసమే పోరాడి తెలంగాణ సాధించారన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితులు, ప్రజలను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని, కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. ముంపు గ్రామాల సహకారంతోనే ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్న ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు.

చిత్రం.. భూములను ఇచ్చేందుకు తీర్మాన పత్రాలను మంత్రి హరీశ్‌రావుకు అందజీస్తున్న ఎర్రవల్లి గ్రామస్థులు