తెలంగాణ

నిండిన జూరాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 28: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి వస్తున్న వరద నీటితో జూరాల పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని కళకళలాడుతోంది. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.34 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా, దిగువకు 44,265 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి 40 వేలు, కోయిల్‌సాగర్‌కు 317 క్యూసెక్కులు, బీమా ప్రాజెక్టుకు 650 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు వెయ్యి క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాలువలకు 800 క్యూసెక్కులు, సమాంతర కాలువకు వెయ్యి క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతున్నట్లు తెలిపారు. ఆల్మట్టి జలాశయంలో 519.60 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుండి 25,420 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 10 వేల క్యూసెక్కుల దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలో 491.910 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుండి 27,578 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 6 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాల జలవిద్యుత్కేంద్రం వద్ద ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. 40 వేల క్యూసెక్కుల నీటితో 180 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.

చిత్రం.. నిండుకుండలా జూరాల జలాశయం