తెలంగాణ

దేవనాత జీయర్‌కు పుష్కర ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: కృష్ణా పుష్కరాల్లో పాల్గొనవలసిందిగా దేవనాత రామానుజ చిన్న జీయర్ స్వామిని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. కృష్ణా పుష్కరాల ఆహ్వాన కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో గురువారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. జీయర్ స్వామి ఆధ్వర్యంలో బీచ్‌పల్లి పుష్కర ఘాట్ వద్ద యజ్ఞం చేసేందుకు ఏర్పాటు చేయాలని రమణాచారి కోరారు. యజ్ఞానికి అయ్యే ఖర్చును కొంత దాతల నుండి సేకరించి కొంత ప్రభుత్వం భరించేందుకు ప్రయత్నిస్తామని రమణాచారి తెలిపారు. పుష్కరాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగస్టు 11న బీచ్‌పల్లి పుష్కర ఘాట్లలో పుష్కరాలను ప్రారంభిస్తారని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అక్కడే యజ్ఞం నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ప్రతి ఘాట్‌లో దాదాపు రెండు లక్షల మంది భక్తుల వరకు స్నానాలు చేస్తారని చెప్పారు. దేవాదాయ శాఖ జాయింట్ కమీషనర్ యం.యం.డి. కృష్ణవేణి, అసిస్టెంట్ కమిషనర్ కె వినోద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. జీయర్‌కు పుష్కర ఆహ్వాన పత్రికను అందజేస్తున్న రమణాచారి