తెలంగాణ

లీకేజీల స్పెషలిస్టు రాజ్‌గోపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టి.ఎమ్సెట్-2 లీకేజి కేసులో ప్రధాన సూత్రధారి రాజ్‌గోపాల్ రెడ్డి లీకేజి స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు.
ప్రశ్నాపత్రాలను లీక్ చేయడంలో సిద్ధ హస్తుడైన రాజ్‌గోపాల్ రెడ్డి పూర్వం విజయబ్యాంకులో పనిచేశాడు. విఆర్‌ఎస్ తీసుకున్న తర్వాత బెంగళూరులో ఐశ్వర్యవంతుల కాలనీగా పేరున్న కోరమంగళలో సెటిలయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్సెట్ ప్రశ్నాపత్రాలను లీకు చేయడంలో నిపుణుడని చెప్పవచ్చు. కర్నాటకలో కూడా ప్రశ్నాపత్రాలను లీకు చేసిన చరిత్ర ఉంది. బెంగళూరులో 2006లో ఉషా విద్యా కనె్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. 2007 నుంచి కర్నాటకలో జరిగిన వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొని అరెస్టయ్యాడు. 2014లో ఆంధ్రప్రదేశ్ పిజి మెడికల్ ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు అభియోగాలపై విజయవాడ పోలీసులు రాజ్‌గోపాల్ రెడ్డిని అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలయ్యాడు. రాజ్‌గోపాల్ రెడ్డి ప్రశ్నాపత్రాలను లీక్ చేసి వాటిని ఎంపిక చేసుకున్న విద్యార్ధులకు అందించడం, వారి తల్లితండ్రుల నుంచి డబ్బును స్వీకరించడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినట్లు సిఐడి దర్యాప్తులో వెల్లడైంది.