తెలంగాణ

తక్కువ వ్యవధితో ఎన్నికల ప్రక్రియా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: దేశంలో ఎక్కడైనా 14 రోజుల ఎన్నికల ప్రక్రియ ఉంటుందా? అని టిటిడిపి ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పట్టులేని తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డదారిలోనైనా, దొడ్డి దారిలోనైనా గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఓడిపోతామనే భయంతో ఎన్నికలు నిర్వహించకుండా ఇంతకాలం కాలాయాపన చేసిందని, హైకోర్టు మొట్టికాయ వేయడంతో చివరకు చేసేదిలేక ముందుకు వచ్చిందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో ఉన్న 150 డివిజన్ల సంఖ్యను 200 డివిజన్లకు పెంచేలా పునర్విభజనకు జివో చేరి చేసిందని, ఆ తర్వాత యధాతథంగా 150 డివిజన్లు ఉంటాయని మరో జివో జారీ చేసిందని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్‌కు-మజ్లిస్‌కు మేలు జరిగేలా డీ-లిమిటేషన్ చేసిందని ఆయన విమర్శించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఓట్లు వేసేందుకు అన్ని జిల్లాల ఎమ్మెల్సీలకు ఓటు వేసే వెసులుబాటు కల్పించడం దారుణమని అన్నారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గడువును కుదించడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ఎన్నిక అడ్డంకులు సృష్టించినా, కుట్రలు, కుతంత్రాలు చేసినా తాము ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.