తెలంగాణ

మా విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: ఉన్నత విద్య కోసం హైదరాబాద్ నుంచి అమెరికా వెడుతున్న విద్యార్థులను అమెరికాలో వేధిస్తున్నారని, వెనక్కు పంపిస్తున్నారని, విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఆ దేశ ప్రతినిధి మైకేల్ మల్లిన్స్‌ను కలిసి వివరించారు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులకే కాకుండా దేశవ్యాప్తంగా అనేకమందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వివరించారు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల సర్ట్ఫికెట్లపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయనే విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ నాలుగవ స్థానంలో ఉందని, దేశంలో మొదటి స్థానంలో ఉందని కెటిఆర్ తెలిపారు. పెద్ద సంఖ్యలో విద్యార్థి వీసాలు, ఉద్యోగుల వీసాలు హైదరాబాద్ నుంచే ఉంటున్నాయని అన్నారు. వీసాలు మంజూరు చేసే సమయంలోనే సర్ట్ఫికెట్లు సరైనవి కాదు అనిపిస్తే విచారించాలని, ఇక్కడే నిలిపివేయాలని కోరారు. వీసా పొందిన తరువాత విద్యార్థి ఎంతో వ్యయప్రయాసాలకోర్చి అమెరికాకు చేరిన తరువాత పంపడం సరైంది కాదని కెటిఆర్ తెలిపారు. విద్యార్థులకు బేడీలు వేసి విచారిస్తున్నారని, అవమానించి పంపిస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయని కెటిఆర్ మైకేల్ దృష్టికి తీసుకు వచ్చారు. అమెరికాలో జరుగుతున్నది తమ దృష్టికి వచ్చిందని, విద్యార్థులను అవమానించడం లేదని, బేడీలు వేయలేదని మైకేల్ తెలిపారు. విద్యార్థుల సమస్యలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాయనున్నట్టు కెటిఆర్ తెలిపారు.