తెలంగాణ

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ( పుష్కర పాట్లు-5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 29: కృష్ణా పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో అధికార యంత్రాంగంతో పాటు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల హడావుడి బాగానే ఉంది. కానీ జిల్లాలో 32 ప్రధాన పుష్కర ఘాట్‌లకు గాను ఇప్పటి వరకు కేవలం 16 ఘాట్ల నిర్మాణం పనులు మాత్రమే జరిగాయి. పనులు జరిగిన వాటిని కలరింగ్ తదితర పరికరాలు అమర్చలేదు. కొన్ని పుష్కర ఘాట్ల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనబడుతున్నాయి. జూరాల ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని పెబ్బేరు మండలంలో దాదాపు ఏడు పుష్కరఘాట్లను ప్రభుత్వం గుర్తించి వాటికి నిధులు కేటాయించింది. ఇందులో నాలుగు మేజర్ పుష్కరఘాట్లు ఉన్నాయి. అందులో మూడు పుష్కర ఘాట్ల వైపు అధికారులు కనె్నత్తి చూడటంలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం రంగాపూర్ ఘాట్ దగ్గరకు వచ్చి అన్ని శాఖల అధికారులు, మంత్రులు హడావిడి చేస్తున్నారు తప్ప మిగతా ఘాట్లపై దృష్టి పెట్టకపోవడం శోచనీయం. రామాపురం పుష్కరఘాట్‌కు సైతం భక్తుల తాకిడి ఉంటుంది. బీచ్‌పల్లి, రంగాపూర్ పుష్కర ఘాట్లకు దీటుగానే ఈ ఘాట్‌కు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరం ఉండడంతో పుష్కరసాన్నం ఆచరించడానికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. రామాపురం పుష్కరఘాట్ల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు కనబడుతున్నాయి. పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రధానంగా బిటిరోడ్డు నిర్మించేందుకు కోటి రూపాయాలకు పైగా నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు కంకర రోడ్డు వేసి వదిలేశారు. పుష్కరాల సమయం దగ్గర పడుతుండడంతో బిటిరోడ్డు వేసేది ఎప్పుడోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా పుష్కర ఘాట్ సిమెంట్ పనులు పూర్తికాగా అందుకు కావల్సిన టైల్స్, రంగులు పుష్కరఘాట్‌కు సంబందించిన అలంకరణ పనులు ఇంకా ప్రారంభించలేదు. రామాపురం ఘాట్ దగ్గర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. లైన్లు వేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇంకా బిగించలేదు. పుష్కర ఘాట్ల దగ్గర హైమాస్ట్ లైట్లతో పాటు ఇతర విద్యుత్ పనులు ఏ మాత్రం చేపట్టలేదు. వౌలిక వసతుల విషయానికి వస్తే ఈ ఘాట్ దగ్గర కేవలం 20 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 80 శాతం చేయాల్సి ఉంది. మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో కేవలం పునాదులు తీసినా నిర్మాణ పనులు చేపట్టడడం లేదు. పార్కింగ్ స్థలాన్ని గుర్తించినప్పటికిని అందులో ఉన్న మురికి తుమ్మ, పిచ్చిమొక్కలను తొలగించిన దాఖలాలు కనబడడం లేదు. పార్కింగ్ స్థలాన్ని ఇంకా చదును చేయకపోవడంతో రామాపురం పుష్కర ఘాట్ దగ్గర పనులు ఏమేరకు నడుస్తున్నాయో వీటిని చూస్తే అర్థం అవుతుంది. పుష్కర ఘాట్ నిర్మాణానికి రూ.87.15లక్షల నిధులు కేటాయించారు. కానీ పనులు మాత్రం పూర్తి కాలేకపోయాయి. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల ప్రచారం జోరుగా ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనుల్లో మందకొడిగా ఉండడం విమర్శలకు దారితీస్తుంది.