తెలంగాణ

కెనరా బ్యాంకులో.. బంగారానికి కాళ్లొచ్చాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జనవరి 5: బంగారం నాణ్యతను పరిశీలించాల్సిన బ్యాంకు అప్రైజరే బినామి పేర్లతో నకిలీ బంగారాన్ని కుదువబెట్టి గోల్డ్‌లోన్ల పేరిట సుమారు 70లక్షలు డ్రా చేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. నల్లగొండ జిల్లాలోని కెనరాబ్యాంకు భువనగిరి, కొండమడుగు, యాదగిరిగుట్ట, కూనూరు గ్రామశాఖలలో ఖాతాదారుల బంగారం నాణ్యతను పరీక్షించేందుకు టి.గిరిధరాచారి ఒక్కరే అప్రైజర్‌గా కొనసాగుతున్నాడు. భువనగిరి పట్టణంలోని హాన్మాన్‌వాడ సంజీవనగర్‌లో నివాసముంటున్న గిరిధరాచారి భువనగిరి, బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామశాఖలలో నకిలీ బంగరాన్ని కుదువపెట్టి గోల్డ్‌లోన్లరూపంలో డబ్బులు డ్రాచేసిన సంఘటనలు బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చాయి. భువనగిరి సిఐ మాదాసు శంకర్‌గౌడ్ తెలిపిన వివరాల మేరకు 2014-15సంవత్సరంలో 31మంది బినామిపేర్లతో నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా ధృవీకరించి గిరిధరాచారి 53లక్షల రూపాయల పైచిలుకు గోల్డ్‌లోన్లరూపంలో డబ్బులు తీసుకున్నారు. 15రోజుల క్రితమె బ్యాంకు అధికారులకు జరిగిన కుంభకోణం దృష్టికి వచ్చినా పోలీసులకు ఫిర్యాదుచేయకపోవడంతో సిబ్బంది చేతివాటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులో ఆడిట్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి గోల్డ్‌లోన్ల కుంభకోణాన్ని ధృవీకరించడంతో మేనేజర్లు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆలేరు మండలం యాదగిరిగుట్ట, భువనగిరి మండలంలోని కూనూరు కెనరా బ్యాంకు శాఖల వివరాలు ఇంకా రావల్సి ఉంది. భువనగిరి కెనరా బ్యాంకు మేనేజర్ వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, అప్రైజర్ గిరిధరాచారి పరారీలో ఉన్నట్లుగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శంకర్‌గౌడ్ తెలిపారు.
కొండమడుగుశాఖలో...
మండలంలోని కొండమడుగు కెనరాబ్యాంకు శాఖలో ఆరుగురు బినామి ఖాతాదారుల పేరున 15లక్షల 5వేల 925రూపాయలు గోల్డ్‌లోన్లరూపేణా తీసుకున్నట్లుగా కొండమడుగు శాఖ మేనేజర్ సుచిత్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. మేనేజర్ సుచిత్ర ఫిర్యాదులో శశికిరణ్, బాబు, మల్లారెడ్డి, శ్రీనివాసాచారి, కోటేశంల పేరుతో నకిలీ బంగారం లోన్లు బయటపడగా శశికిరణ్, బాబుల పేర్లతో భువనగిరిలో కూడా గోల్డ్‌లోన్లు ఉన్నట్లుగా సమాచారం. మేనేజర్ ఫిర్యాదుమేరకు దర్యాప్తుచేపడుతున్నట్లుగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వారాల తిరుపతి తెలియజేసారు.

గోల్డ్‌లోన్ కుంభకోణం చోటుచేసుకున్న
కెనరాబ్యాంకు భువనగిరి శాఖ భవనం