జాతీయ వార్తలు

పిఎఫ్ కనీస పింఛను రూ.3వేలకు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: పిఎఫ్ కనీస పింఛనును నెలకు రూ 3 వేల రూపాయలకు పెంచాలని, ఉద్యోగుల పింఛను పథకాన్ని సమీక్షించాలని, ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్)లో ప్రభుత్వ వాటాను పెంచాలని శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉద్యోగుల భవిష్య నిధి పెన్షనర్ల సంక్షేమానికి తీసుకోవలసిన చర్యలపై ఆర్‌ఎస్‌పి సభ్యుడు ఎన్‌కె ప్రేమచంద్రన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్ రాయ్ సమర్థిస్తూ ఇపిఎఫ్‌లో ప్రభుత్వ వాటా 1971నుంచి 1.16 శాతంగానే ఉందని అంటూ, దీన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాదిరిగా అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు కూడా పిఎఫ్‌ను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. వేల కోట్ల విలువైన పెన్షన్ సొమ్ము ప్రభుత్వం వద్ద వృథాగా పడిఉందని ఆయన అన్నారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఉపయోగించని పెన్షన్ మొత్తాన్ని సీనియర్ సిటిజన్ల పెన్షన్ నిధి కోసం ఉపయోగించాలి. అయితే దీన్ని రాయ్ వ్యతిరేకిస్తూ కార్మికుల సొమ్మును వారికోసమే ఉపయోగించాలని, సీనియర్ సిటిజన్ల నిధి కోసం ప్రభుత్వం వేరేగా నిధులు కేటాయించాలని అన్నారు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇపిఎఫ్‌ను అనుమతించడాన్ని సైతం ఆయన వ్యతిరేకించారు.
వచ్చే వారం రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు
న్యూఢిల్లీ, జూలై 29: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు వచ్చే వారం రాజ్యసభలో చర్చకు రానుంది. రాజ్యసభలో ఆగస్టు 1నుంచి ప్రారంభమయ్యే వారానికి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ శుక్రవారం ఒక ప్రకటన చేస్తూ జిఎస్‌టికి సంబంధించి 122వ రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చే వారం సభలో చర్చకు వస్తుందని తెలిపారు. ఆగస్టు 12తో ముగిసే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే జిఎస్‌టి బిల్లుకు ఆమోదం పొందాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఇదివరకే ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభలో ప్రతిపక్షాలు తాము ప్రతిపాదించిన సవరణలకు అంగీకరించేదాకా ఆమోదించేది లేదని భీష్మించుకోవడంతో చివరకు ప్రభుత్వం సైతం ఆ సవరణలకు అంగీకరించాల్సి వచ్చింది. గత బుధవారం కేంద్రమంత్రివర్గం బిల్లులో ఈ మేరకు మార్పులు చేయడానికి ఆమోదముద్ర వేసింది కూడా.

వచ్చేవారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందితే అది తిరిగి లోక్‌సభకు వెళ్లాల్సి ఉంటుంది.