తెలంగాణ

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 30: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత కొన్ని సంవత్సరాలుగా కరీం నగర్ జిల్లా రామగుండంలో ఖాయిలాపడ్డ పరిశ్రమకు పునర్జీవం పోసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 6 వేల కోట్లతో రామగుండంలో ఎరువులు, రసాయన ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఆగస్టు 7న ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 5 వేల మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధితో పాటు పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన అన్నారు. మూడేళ్లలో ఈ పరిశ్రమను పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారని అన్నారు. ఈ ఫ్యాక్టరీలో 13 లక్షల టన్నుల యూరియా, 3 లక్షల టన్నుల అమోనియా ఉత్పత్తి అవుతుందని, ఈ పరిశ్రమ ద్వారా తెలంగాణలో రైతులకు ఎరువుల సమస్యల తీరుతుందన్నారు. బిజెపి రాష్ట్ర శాఖ విజ్ఞప్తి మేరకే కేంద్రం స్పందించి రామగుండంలో మూతపడ్డ ఎరువుల ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పరిపాలన అనుభవం లేకపోవడం పట్ల తెలంగాణలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం ఎంసెట్‌ను కూడా నిర్వహించలేని అసమర్ధత ప్రభుత్వమని ఆయన విమర్శించారు. ఇప్పటికే విద్యార్థులు రెండుసార్లు ఎంసెట్ రాశారని, మరోసారి కూడా రాసే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ఎంసెట్ లీక్ మూలాలను కనుగొని అందుకు నైతిక బాధ్యతగా మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను ప్రభుత్వం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో చేపట్టాలనుకున్న మల్లన్నసాగర్ విషయంలో ప్రభుత్వం ఒం టెద్దు పోకడలకు పోతోందని, ప్రాజెక్టుల డిజైన్‌లు సరిగ్గా లేవని నిపుణులు చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.