తెలంగాణ

శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 31: కర్ణాటక, మహారాష్టల్రో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతూ తెలుగు రాష్ట్రాలను తాకింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జూరాలకు స్థిరంగా వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి సైతం వరద ఉదృతి కొనసాగుతోంది. ఇటు జూరాల, అటు సుంకేసుల డ్యాంల నుండి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూనే ఉంది. అయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రతి రోజు పెరుగుతుండడంతో అధికారులు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్-1 పంప్‌లను ప్రారంభించి, ఎల్లూరు రిజర్వాయర్‌లోకి బ్యాక్‌వాటర్‌ను నింపుతున్నారు. ఈ రిజర్వాయర్ నుండి సింగోటం శ్రీవారి సముద్రంలోకి కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. సింగోటం శ్రీవారి సముద్రం నిండిన తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్-2ను ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల వ్యవధిలో కల్వకుర్తి లిఫ్ట్-2 జొనలబొగుడను అధికారికంగా ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. శ్రీశైలం బ్యాక్‌వాటర్ కృష్ణాజలాలు కల్వకుర్తి లిఫ్ట్-1 నుండి ఎత్తిపోస్తుండడంతో ఈ ఏడాది కల్వకుర్తి ప్రాజెక్టు కింద 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకుగాను సర్వం సిద్ధం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని రూ.3081 కోట్ల అంచనాతో మహబూబ్‌నగర్ జిల్లాలోని 23 మండలాలలోని 3.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లిఫ్ట్ట్-1ను అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. అయితే ప్రస్తుతం లిఫ్ట్ట్-2ను ప్రారంభించి దాదాపు 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోస్తుండడంతో లిఫ్ట్-2 త్వరలోనే ప్రారంభం కానుంది.

కల్వకుర్తి ఎత్తిపోతల దగ్గరకు చేరిన శ్రీశైలం బ్యాక్ వాటర్