తెలంగాణ

లాభాల బాటలో నడిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసిని లాభాల బాటలో నడిపించేందుకు కృషి సల్పుతున్నామని, రూ. 5 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సంస్థను పటిష్టం చేయనున్నట్టు టిఎస్‌ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం బస్‌భవన్‌లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లతో కలసి సమావేశమైన చైర్మన్ ఆర్టీసి పురోభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రయాణికులకు మరిన్ని మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు గానూ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల పెంచిన బస్సు చార్జీల ద్వారా ఆర్టీసికి రూ. 250 కోట్లు మాత్రమే వస్తుండడంతో సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల జీతభత్యాలు, అలవెన్సులు, ఏరియర్స్ చెల్లింపులకు మాత్రమే సరిపోతుందన్నారు. గత సంవత్సరం కంటే ఈ యేడు అధికంగా రూ. 900 కోట్ల మేర టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రయాణికుల అవసరాలను గుర్తించి తదనుగుణంగా సర్వీసులను నడిపిస్తూ ప్రయాణికులకు చేరువ కావాలని, అప్పుడే ప్రయాణికుల ఆదరణ లభిస్తుందన్నారు. ఈ సంవత్సరం 1575 కొత్త బస్సులు, 236 మినీ బస్సులు కొనుగోలు చేస్తున్నట్టు చైర్మన్ వెల్లడించారు. ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు 1150 బస్సులు నడుపనున్నట్టు తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఏసి బస్సులను కూడా అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్‌లో అధికారులతో సమీక్షిస్తున్న ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ