తెలంగాణ

మళ్లీ.. రోడ్లువేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగర రోడ్లన్నింటినీ పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నిజాం కాలంనాటి రోడ్లనే ఇప్పటికీ వాడుతున్నట్టే, తాము పునర్నిర్మించే రోడ్లనే మరో వందేళ్లపాటు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం నగర రోడ్ల దుస్థితి- తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ మంత్రి కె తారకరామారావు, నగర మేయర్ బొంతు రాంమ్మోహన్‌తో పాటు మున్సిపల్, ఆర్ అండ్ బి, ట్రాన్స్‌కో, మెట్రోరైలు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమై చర్చించారు. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధిపై ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌తో కలిసి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నాలుగైదేళ్లలో దశలవారీగా రోడ్ల పునర్నిర్మాణం జరగాలన్నారు. మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా వంద కిలోమీటర్ల మేర రోడ్లను మెరుగుపర్చాలని ఆదేశించారు. నగర రోడ్ల అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యమవుతామని సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియోషన్ ముందుకొచ్చినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నగర రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు అవస్థతలు పడుతున్నారని, వర్షాకాలంలో అయితే ప్రజల బాధలు చెప్పనలవి కానివని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అతికొద్ది మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కూడా హైదరాబాదేనన్నారు. కరంట్ లైన్లు, డ్రైనేజీ పైపులైన్లు, టెలిఫోన్ కేబుల్స్ కోసం తరుచూ రోడ్లను తవ్వేస్తున్నారని దీనివల్ల ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. అన్ని కేబుల్స్, పైపులైన్లు ఒకే మార్గం ద్వారా వెళ్లే విధంగా డక్ట్స్ ఏర్పాటు చేయాలని, రోడ్లన్నింటనీ నాలుగు, ఆరు లైన్ల రోడ్లుగా నిర్మించాలని, పాదచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు నిర్మించాలని ఆదేశించారు. మెట్రో రైలు పనుల వల్ల ట్రాఫిక్ జామ్ సమస్య తల్తెకుండా ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేయాలని, అలాగే మూసీనదికి ఇరు వైపుల రోడ్లు నిర్మించాలన్నారు. హైదరాబాద్ నగరం ఎప్పుడో గ్రిడ్ లాక్ అయిందని, ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా రోడ్ల వ్యవస్థను రూపొందించుకోవడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి అన్నారు. నగరంలోకి వచ్చే ప్రధాన రోడ్లన్నింటినీ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా మార్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం స్పందించి చర్లపల్లి, నాగులపల్లిలో మరో రెండు అదనపు రైలు టర్మినళ్లను నిర్మించడానికి అంగీకరించిందన్నారు. దీనివల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై వత్తిడి తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఇలీబన్, జూబ్లీ బస్ స్టేషన్ల మాదిరిగా నగరం చుట్టూ మరికొన్ని బస్ టర్మినల్స్ నిర్మించాలన్నారు. మెట్రోరైలు మార్గం నిర్మాణ ప్రణాళిక కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు. కనీసం విమానాశ్రయానికి వెళ్లడానికైనా మెట్రోరైలు మార్గం లేదని సిఎం అన్నారు. రెండో దశ మెట్రోరైలు మార్గమైనా ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలని సిఎం కెసిఆర్ సూచించారు.
chitram...
హైదరాబాద్ నగర రోడ్ల స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్