ఆంధ్రప్రదేశ్‌

రోళ్లపాడు సంరక్షణ కేంద్రంలో బట్టమేక పక్షి సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, ఆగస్టు 3: ‘ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’గా పిలువబడే బట్టమేక పక్షి ఎట్టకేలకు కనిపించింది. గత పది రోజుల్లో ఏకంగా మూడు బట్టమేక పక్షులు కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనిపించినట్లు రైతులు తెలిపారు. గత ఆరేళ్లుగా ఆనవాళ్లు లేకుండా పోయిన ఈ పక్షి మళ్లీ కనిపించడంతో అటవీశాఖ అధికారులు, పక్షి ప్రేమికుల్లో ఆనందం చోటుచేసుకుంది. ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు బట్టమేక పక్షలను చూసినట్లు రైతులు తెలిపారు. ఈసారి ముందస్తు వర్షాలు కురియడంతో కేంద్రం ఆవరణ మొత్తం పచ్చిక ఏపుగా పెరగింది. కేంద్రం సమీపంలోని అతిపెద్ద మద్దిగుండం చెరువు, అలగనూరు రిజర్వాయర్, తెలుగుగంగ కాల్వల్లో నీరు పుష్కలంగా చేరింది. దీంతో ఇటీవల మూడు బట్టమేకపక్షులను కేంద్ర పరిధిలో సంచరిస్తుండగా చూసినట్లు రైతులు తెలిపారు. ఈ పక్షులు జూన్ నుంచి సెప్టెంబరు వరకు సంతతిని వృద్ధి చేసుకుంటాయి. చల్లటి వాతావరణం గుబురుగా వుండే ప్రదేశాల్లో సంవత్సరానికి ఒకసారి మాత్రమే గుడ్డుపెట్టి పొదిగి సంతానాన్ని పెంపొందిస్తాయి. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడంతో కేంద్రం పరిధిలో అక్కడక్కడ పక్షులు కన్పించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం సమీపంలోని మద్దిగుండం చెరువు, బరక సంజీవరాయుడు దేవాలయం, నంద్యాల రహదారి సమీపంలో బట్టమేక పక్షులు కన్పించినట్లు స్థానికులు తెలిపారు. మూడు పక్షులు వచ్చాయంటే ఇంకా చాలా ఉంటాయని, పచ్చిక బయళ్లలో తిరుగుతుంటాయని రైతులు అంటున్నారు. ఇటీవల కన్పించిన పక్షులు ఎత్తుగా వుండడంతో అవి గుడ్లు పెట్టేందుకే వచ్చి వుండవచ్చని రైతులు అంటున్నారు. పక్షుల సంచారానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అటవీశాఖ అధికారులు ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. వాటి స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే ఉద్ధేశ్యంతో అధికారులు వీటి సంచారాన్ని బహిరంగంగా వెల్లడించడం లేదు. గోధుమ వర్ణంతో, తలపై టోపీలా, కాలి మూడు వేళ్లు ముందుకు వచ్చి ఉండే బట్టమేక పక్షి మీటరు ఎత్తు పెరుగుతుంది. కర్నూలు జిల్లా మిడుతూరు మండలంలో బట్టమేక పక్షుల సంరక్షణ కోసం 1986లో సుమారు 2,500 ఎకరాల్లో రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అతి త్వరగా అంతరించిపోతున్న జాతుల్లో ఒకటయిన బట్టమేక పక్షులు రోళ్లపాడులో మొదట్లో 70 వరకు ఉండేవి. దీంతో ఈ ప్రాంతం పర్యాటకకేంద్రంగా మారింది. వాతావరణంలో నెలకొన్న మార్పులు, వర్షాభావం, ఎండ అధికం కావడం, రైతులు సాగుచేసే పంటల్లో మార్పులు, ముఖ్యంగా వేరుసెనగ, కొర్ర, తీగజాతి పంటల సాగు తగ్గిపోవడంతో ఆహారం కరవై పక్షులు జాడలేకుండా పోయాయి. దీనికితోడు ఈ పక్షులు పెట్టిన గుడ్లను నక్కలు, తోడేళ్ల తినడంతో పాటు జింకల సంఖ్య విపరీతంగా పెరగడంతో వాటి కాళ్ల కింద పడి గుడ్లు పగిలిపోయేవి. దీంతో వీటి సంతతి ఎదుగుదలకు అవకాశం లేకుండా పోయింది. బట్టమేక పక్షుల జాడ లేకోవడంతో రోళ్లపాడు కేంద్రంలో కేవలం వాటి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈసారి రోళ్లపాడు కేంద్రంలో మళ్లీ బట్టమేక పక్షుల సంచారం మొదలు కావడంతో వైభవం సంతరించుకుంటుందని భావిస్తున్నారు.