తెలంగాణ

ప్రజాభీష్టం మేరకే అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, ఆగస్టు 3: పారిశ్రామిక రంగం కోసం తెరాస ప్రభుత్వ అనుకూలంగా ఉన్నప్పటికీ పరిశ్రమలను నెలకొల్పే ప్రాంతాల్లో ప్రజాభీష్టం మేరకే వాతావరణ కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి పరిశ్రమలకు అనుమతులుండవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యేతో కలిసి బుధవారం మంత్రులు విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే పరిశ్రమలు వాతావరణ కాలుష్యాన్ని వెదజల్లుతూ నష్టం కలిగిస్తాయంటే అట్టి పరిశ్రమలకు తమ ప్రభుత్వం అనుమతులను మంజూరు చేయదన్నారు. ఇదిలావుండగా మెదక్ జిల్లాలో చేపట్టే మల్లన్నసాగర్ సాగునీటి ప్రాజెక్టుకు ప్రజలు రైతులు సహకరిస్తుంటే ఎలాంటి పనిలేని ప్రతిపక్ష పార్టీలవారు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తూ నిరాశ నిస్పృహలను కలుగచేస్తున్నారన్నారు. గతంలో నిర్మించిన ప్రాజెక్టులకన్నా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముందస్తుగానే నష్టపరిహారాన్ని చెల్లించేందుకు కృషిచేశారని, అందుకు ప్రజలు రైతులు సమ్మతిస్తే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నాయని విమర్శించారు. నాగార్జునసాగర్ ఎడమకాలువ ద్వారా నీటిని విడుదల చేయించేందుకు సిఎం కెసిఆర్ కృషిచేస్తున్నారన్నారు.
కృష్ణాపుష్కరాలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. రవాణా సౌకర్యానికి రోడ్లు, పుష్కరఘాట్లను, తాగునీటి వసతులు, శానిటేషన్‌తో పాటు పనులన్నీ పూర్తయ్యాయని, గోదావరి పుష్కరాల కంటే కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే అధికార యంత్రాంగం పూర్తిచేసిందన్నారు.

ఈటల కాన్వాయికి తప్పిన ప్రమాదం
మెట్‌పల్లి, ఆగస్టు 3: రాష్ట్ర ఆర్థిక మంత్రి శాఖ మంత్రి ఈటల రాజేందర్ వాహనానికి బుధవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి ఈటల కరీంనగర్ నుండి కాకతీయ కాల్వ నీటి విడుదల కోసం బుధవారం నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌కు వెళ్తుండగా, మెట్‌పల్లిలోని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నివాసం వద్ద కాన్వాయిని నిలిపివేసే క్రమంలో కాన్వాయలోని కార్లు సడన్ బ్రేకులు వేయడంతో మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొని పాక్షికంగా దెబ్బతిన్నాయి. అప్పకే మంత్రి కారు ముందుకు వెళ్ల్లడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు.