తెలంగాణ

వట్టిపోయిన సింగూర్‌లోకి వడివడిగా వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 4: రెండేళ్లు నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో చరిత్రలో ఎన్నడు లేని విధంగా సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా వట్టిపోగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. వడివడిగా వస్తున్న వరదతో 6.23 టిఎంసిలకు నీరు నిల్వకొచ్చింది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల ద్వారా మంజీర నదిలోకి వరద నీరు వస్తోంది. ఎగువన మహారాష్ట్ర, కర్నాటకల్లోని ప్రాజెక్టులు నిండుకుంటే మరింతగా వరద తాకిడి పెరిగే అవకాశం ఉంది. గురువారం సాయంత్రానికి 516.65 మీటర్ల నీటి మట్టంతో 6.23 టిఎంసిల నీటి నిల్వకు చేరుకుంది. కర్నాటకలోని కారింజకు దిగువన ఉన్న వాగుల ద్వారా మాత్రమే సింగూర్‌లోకి వరద నీరు వస్తుంది. గురువారం ఉదయం 9500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి 6363 క్యూసెక్కులకు తగ్గింది. మరిన్ని వర్షాలు కురిస్తే సింగూర్ ప్రాజెక్టు ఎప్పటిలాగే నిండుకుంటుందని రైతులు, అధికార యంత్రాంగం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కురుస్తున్న వర్షాలతో ఆశలు సజీవంగా నిలుస్తున్నాయి.