తెలంగాణ

గర్భాలయంలో కూర్మం ప్రదక్షిణలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, ఆగస్టు 4: కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లి మ్రోయతుమ్మెద వాగు ఒడ్డున కిష్టమ్మ గుట్టపై కొలువైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి గర్భాలయంలో ఓ కూర్మం (తాబేలు) గురువారం అదే పనిగా ప్రదక్షిణలు చేసింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రదక్షిణలు చేసిన తాబేలు విగ్రహాల ఎదురుగా ఉంది. రోజూలాగే పూజాదికాల కోసం ఆలయానికి వెళ్లిన అర్చకుడు శ్రీ రంగం నర్సింహాచార్యులు ఈ విషయం గమనించి గ్రామస్థులకు తెలపడంతో తండోపతండాలుగా జనం వచ్చి దర్శించుకున్నారు. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన కూర్మావతారం ఉన్నందున తాబేలు ప్రదిక్షణం చేయడం అది భగవత్ మహిమగా భక్తులు భావిస్తున్నారు. పవిత్ర శ్రావణ మాసం ఆరంభంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం మరిం త ప్రాధాన్యతను సంతరించుకొని భక్తులు వెళ్లి పూజాదికాలు నిర్వహించారు.
తాబేలు మూలవిరాఠ్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం శుభసూచకమని భక్తులు భావిస్తుండగా, అదే పనిగా ప్రదక్షిణలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.