తెలంగాణ

ఈ-వేలంలో ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: నిర్మాణం పూరె్తై ఎంతోకాలంగా గృహ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న వేలాది గృహాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వేలం ద్వారా ఇళ్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన గృహాలను చాలాకాలంగా ఎవరికీ కేటాయించకుండా వదిలేశారు. 3,718 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల గృహ నిర్మాణ శాఖకు తొమ్మిది వందల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. నాగోల్- బండ్లగూడలో రాజీవ్ స్వగృహ ప్లాట్ల సమస్య చాలా కాలంగా అలానే ఉంది. ఒక దశలో వీటిని ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలనే ఆలోచన చేశారు. అనేక ప్రయత్నాల తరువాత వేలం ద్వారా విక్రయించాలని తాజాగా నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లను గృహ నిర్మాణ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం సందర్శించారు. మొదటి దశలో బండ్లగూడలోని 3,718 ప్లాట్లను వేలం వేస్తారు. అనంతరం దశల వారీగా ఇతర ప్రాంతాల్లోని ఇళ్లపై నిర్ణయం తీసుకుంటారు. మొదటి దశలో బండ్లగూడ, పోచారంలో నిర్మించిన 3718 ప్లాట్లను ఓపెన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించనున్నట్టు గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తరఫున ఓపెన్ బిడ్డింగ్ నిర్వహిస్తోన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి చేపట్టిన ఆన్‌లైన్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. ఆగస్టు 7 నుంచి 17 వరకు ఓపెన్ బిడ్డింగ్ నిర్వహిస్తారు. గృహ నిర్మాణ శాఖ అన్ని వౌలిక వసతులతో కూడిన ప్లాట్లను నిర్మించిందని, వీటిని కొనుగోలు చేయాలనుకునే వారు బిడ్డింగ్‌లో పాల్గొనాలని మంత్రి కోరారు. ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఒకేసారి ఇంత మొత్తంలో ఆన్‌లైన్‌లో ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ప్లాట్లను విక్రయించడం దేశంలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్లాట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. అసంపూర్ణంగా ఉన్న ప్లాట్లను మరమ్మత్తు చేసేందుకు 50 కోట్ల ఖర్చుతో ఆరునెలల్లో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ కుమార్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సిఇ ఈశ్వరయ్య, వివిధ బ్యాంకుల అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ప్లాట్లతోపాటు చిన్న చిన్న పనులు మిగిలిన ప్లాట్లను సైతం ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. మొదటి దశలో బండ్లగూడలోని 2244 ప్లాట్లు, పోచారంలో 1474 ప్లాట్లను విక్రయిస్తారు. బండ్లగూడలో కనిష్టంగా చదరపు అడుగుకు 2200 వసూలు చేయనున్నారు. నిర్మాణం పూరె్తైన ప్లాటుకు చదరపు అడుగుకు 2800 రూపాయల కనిష్ట ధర నిర్ణయించారు. పోచారంలో చదరపు అడుగుకు 1700 రూపాయలు, గరిష్ట ధర 1900 రూపాయలు నిర్ణయించారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా గృహ నిర్మాణ శాఖకు తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

చిత్రం... ఈ-వేలానికి పెడుతున్న రాజీవ్ స్వగృహ ఇళ్లు