అంతర్జాతీయం

మా సాయం బ్లాంక్ చెక్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 5: గతంలో మాదిరిగా పాకిస్తాన్‌కు అమెరికా గుడ్డిగా సాయం చేసే పరిస్థితి ఎంత మాత్రం లేదని, తాము ఏం చేసినా చెల్లుతుందన్న భావన నుంచి ఆ దేశ పాలకులు బయటపడాలని అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేశారు. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా అమెరికా తమకు‘బ్లాంక్ చెక్కులు’ ఇస్తుందని పాకిస్తాన్ ఆశిస్తే పొరపాటేనని తెలిపారు. ముఖ్యంగా హక్కానీ నెట్‌వర్క్ సహా అనేక ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలం కావడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మాజీ వైట్‌హౌస్ అధికారి, దక్షిణాసియా వ్యవహారాల నిపుణురాలు షమీలా చౌదరి అన్నారు. ఒకప్పుడు ఉగ్రవాదంపై పోరాటానికి పాక్ మద్దతు అవసరం కాబట్టి ఆదేశానికి మద్దతు ఇచ్చే విధానాన్ని అమెరికా అనుసరించిందని కానీ ఈ నమ్మకాన్ని పాక్ నిలబెట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు. హక్కానీ నెట్‌వర్క్‌ను నిర్మూలించాలంటూ పాకిస్తాన్‌కు అనేక సార్లు అమెరికా విజ్ఞప్తి చేసిందని ఆమె గుర్తుచేశారు. ఆఫ్గనిస్తాన్‌లోని అమెరికన్లపై ఈ నెట్‌వర్క్‌కు చెందిన మిలిటెంట్లు దాడి చేశారని తెలిపారు.ఇటీవల పరిణామాల నేపథ్యంలో అమెరికా, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయని వెల్లడించారు. జార్జిబుష్ హయాంలో పాకిస్తాన్ విషయంలో అనుసరించిన విధానానికి ఒబామా పగ్గాలు చేపట్టిన తరువాత మారిన పరిస్థితులను వివరించారు. ముఖ్యంగా 300 మిలియన్ డాలర్ల సహాయాన్ని పాక్‌కు నిలిపివేయడానికి ప్రధాన కారణం ఉగ్రవాద నిర్మూలనలో అది విఫలం చెందడమేనని స్పష్టం చేశారు.