తెలంగాణ

పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తొలి ఘనత తెలంగాణదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 6: పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేట శక్తిగార్డెన్‌లో బుధవారం పోలీసు శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న సిద్దిపేట ఉద్యోగ సాధనలో ముందుండాలనే ఉచితంగా పోలీసు శిక్షణను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిభావంతులచే యువతకు ఈ శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. కోచింగ్‌ల పేరుతో విద్యార్థికి సుమారు 25వేల వరకు ఖర్చు పెడతారని, కానీ అన్ని సౌకర్యాలతో నిపుణులచే శిక్షణను ఇప్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల కోసం 9281 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఏప్రిల్ 3న కానిస్టేబుల్ నియామకంపై అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఈనెల 12నుంచి ఈవెంట్స్‌లో సైతం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీసు శాఖలో 2వ ఫేజ్ పేరిట మరిన్ని ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. తెలంగాణకు 4 బెటాలియన్లు, హైదరాబాద్ సివిల్ పోలీసుల కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
తెలంగాణలో ముస్లింలు అధికంగా ఉన్నారని, ఉర్దూమీడియం విద్యార్థులు ఉర్దూలో రాసే విధంగా సిఎం దృష్టికి తీసుకెళ్లి అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
గ్రూప్ 2కు ఉచిత కోచింగ్
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. సిద్దిపేట ప్రాంత నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే పోలీసు శాఖ అర్హతలో మెయిన్స్‌కు ఎంపికైన వారి కోసం ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన శిక్షణ పొందిన వారికి 6లక్షల విలువైన మెటీరియల్ సెట్‌ను మంత్రి హరీష్‌రావు, ఎంపి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ అందించారు. ఈ కార్యక్రమంలో శిక్షకుడు జగదీష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సిఐలు సైదులు, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.