తెలంగాణ

స్పాట్ అడ్మిషన్లలో ఉల్లంఘనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణలో ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులతో ఆటలాడుకుంటున్న యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల రూపంలో అనేక ఉల్లంఘనలకు తెరతీశాయి. స్పాట్ అడ్మిషన్లను సైతం మెరిట్ ప్రాతిపదికపై భర్తీ చేయాల్సి ఉన్నా, తమకు అనుకూలంగా ఉండి, ఎక్కువ ఫీజులు చెల్లించేందుకు సిద్ధపడిన విద్యార్థులకు మాత్రమే సీట్లుకేటాయిస్తూ, లక్షలాది రూపాయిలను గుంజుతున్నాయి. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించినపుడు వాటిని సైతం మెరిట్ ప్రకారం ప్రభుత్వం సూచించిన ఫీజుకే కేటాయించాల్సి ఉన్నా యాజమాన్యాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. యాజమాన్యాల వ్యవహారంపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై చర్యలు తప్పవని తెలగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ పేర్కొంది.
ఈ మేరకు రెగ్యులేటరీ కమిటీ కన్సల్టెంట్ వి రామారావు ఒక ప్రకటన విడుదల చేశారు. 30వ తేదీలోగా చేర్చుకున్న విద్యార్థులు వారి వివరాలు, ర్యాంకుల జాబితాలను రెగ్యులేటరీ అథారిటీకి అప్పగించాలని పేర్కొన్నారు.
బైపిసి అడ్మిషన్ల కౌనె్సలింగ్
ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్లకు బైపిసి అభ్యర్ధులతో నిర్వహించిన కౌనె్సలింగ్ ముగిసింది. సర్ట్ఫికేట్ల పరిశీలనకు 11,905 మంది హాజరుకాగా, అందులో తుది దశ అడ్మిషన్లకు బి ఫార్మసీలో 3666 సీట్లు, ఫార్మా డిలో 687 సీట్లు ఉన్నాయని, వారికి ఈ నెల 11వ తేదీ 8 గంటల తర్వాత సీట్ల కేటాయింపు జరుగుతుందని ఎమ్సెట్ అడ్మిషన్స్ కన్వీనర్ డాక్టర్ ఎంవి రెడ్డి చెప్పారు.
డిగ్రీ వెబ్ ఆప్షన్లు
ఇంత వరకూ డిగ్రీలో సీట్లు పొందని విద్యార్ధులు ఈ నెల 10, 11 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. వారందరికీ ఈ నెల 13వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది, సీట్లు పొందిన వారు ఈ నెల 16వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.