ఆంధ్రప్రదేశ్‌

కృష్టమ్మ ఒడిలో సంగమేశ్వరాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అగస్టు 9: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమేశ్వరాలయం మంగళవారం పూర్తిగా నీట మునిగింది. సాయంత్రం చివరిసారిగా శిఖర దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడంతో ఆలయం క్రమంగా నీటిమునిగింది. ప్రస్తుతం ఆలయ శిఖరంపై ఉన్న ధ్వజం మాత్రమే కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో అదికూడా మునిగిపోతుందని భావిస్తున్నారు. మంగళవారం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 863 అడుగులకు చేరుకుంది. సంగమేశ్వరంలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు చురుగ్గా చివరి దశకు చేరుకున్నాయి. వేపదారు లింగం కృష్ణమ్మ ఒడిలోకి చేరడంతో భక్తులు ఎగువ భాగాన ఉన్న శివాలయంలో పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

పట్టపగలు 30 లక్షల చోరీ
ఖానాపురం హవేలి, ఆగస్టు 9: ఖమ్మం జిల్లా గార్లలో మంగళవారం పట్టపగలు జరిగిన భారీ చోరీలో 30 లక్షల నగదు, 50 తులాల బంగారం చోరీ జరిగింది. ఇల్లెందు డిఎస్పీ వీరేశ్వరరావు కథనం ప్రకారం కానిస్టేబుల్ జాటోతు కృష్ణ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి డ్రెస్సింగ్ టేబుల్‌లో దాచి ఉంచిన 30లక్షల నగదు, బెడ్ రూమ్‌లోని ఇనుప బీరువాలో ఉన్న 50 తులాల బంగారు నగల్ని దోచుకెళ్ళారు. కృష్ణ వరంగల్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్‌లో విధుల నిర్వహిస్తుండగా భార్య రాజేశ్వరీ పినిరెడ్డిగూడెంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు.

పట్టిసం నుంచి
మళ్లీ నీటి తరలింపు
పోలవరం, ఆగస్టు 9: గత కొద్ది రోజులుగా నిలిచిపోయిన పట్టిసం ఎత్తిపోతల నుండి గోదావరి జలాల తరలింపు కార్యక్రమం మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యింది. మూడు మోటార్లను ఆన్‌చేసి 1060 క్యూసెక్కుల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన కృష్ణా జిల్లా పల్లెర్లమూడి గ్రామ సమీపాన 122వ కిలోమీటర్ వద్ద రామిలేరు అండర్ టనె్నల్‌కు గండి పడింది. దీనితో అప్పటివరకు 12 మోటార్ల ద్వారా కృష్ణాకు 4250 క్యూసెక్కుల నీటి తరలింపు నిలిచిపోయింది. నీటిని తరలించాల్సిన అవసరం లేకపోవడంతో పట్టిసం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అన్ని మోటార్లు నిలిపివేశారు. గత నెల 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు మోటార్లు ఆన్‌చేసి, ఈ సీజన్‌లో గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించే ప్రక్రియను ప్రారంభించిన విషయం విదితమే.