అంతర్జాతీయం

విలువల్లేవు.. వ్యక్తిత్వం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 9: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే దేశ చరిత్రలో అత్యంత నిర్లక్ష్యపు అధ్యక్షుడవుతాడని రిపబ్లికన్ పార్టీకి చెందిన 50మంది అత్యున్నత జాతీయ భద్రతా నిపుణులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్‌కు వ్యక్తిత్వం లేదని, స్వయం నియంత్రణ అసలు లేదని, అత్యంత ప్రమాదకరమైన గుణాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా, సైనిక కమాండర్‌గా అణ్వస్త్ర సంపదను నియంత్రించే శక్తిగా ఉండాల్సిన వ్యక్తికి ఇలాంటి గుణాలుండటం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టినట్టేనని వారన్నారు. తమలో ఎవ్వరూ కూడా ట్రంప్‌కు ఓటేయబోమని కూడా వాళ్లు తేల్చి చెప్పారు. ట్రంప్‌కు అనుభవం, విలువలు లేవన్నారు. విదేశాంగ విధానం కోణంలో ఆలోచిస్తే ట్రంప్ ఎట్టి పరిస్థితిలోనూ అధ్యక్ష పదవికి పనికిరాడని అన్నారు. ఆయన అధ్యక్షుడైతే అమెరికా నైతిక ఆధిపత్యాన్ని బలహీనం చేస్తాడని వారన్నారు.
అమెరికా చట్టాలు, ప్రభుత్వ వ్యవస్థలు, మత సహనం, పత్రికాస్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటివాటి పట్ల ట్రంప్‌కు ఎలాంటి అవగాహన లేదని, వాటిపైన నమ్మకమూ లేదని విమర్శించారు.