తెలంగాణ

సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: నరుూం ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి నేరస్థులు ఎవరైనా ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని పోలీసు బృందం చేసే విచారణపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. నరుూం సంఘటనను ఆసరాగా చేసుకుని ఉమామాధవరెడ్డి లాంటి గౌరవనీయమైన కుటుంబాలపై బురద చల్లడానికి కుట్రలు చేస్తే తాము సహించేది లేదని అన్నారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. నరుూం ఎన్‌కౌంటర్‌పై అనేక లీకులు వస్తున్నాయని, అయితే వాస్తవాలు ఏమిటో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణలో ఎంతో గౌరవం ఉన్న కుటుంబాల మీద కూడా తెలంగాణ కోసం పాటుపడిన వారిమీద బురదజల్లడం దారుణమన్నారు. టిడిపిపై బురదజల్లడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తే దాని పర్యావసానాలు చవి చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సిఎంకు కెసిఆర్ సన్నిహితుడైన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి శంషాబాద్ ప్రాంతంలో వేల ఎకరాల భూమిని సేకరించాడని ఈ వ్యవహారంలో బాధిత కుటుంబాలు నరుూంని ఆశ్రయించడంతో అతను ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని 50 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు.