తెలంగాణ

దూకుడుకు బ్రేకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సర్కారు దూకుడుకు కోర్టు బ్రేక్‌వేసింది. నేటికీ డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేయకపోవటం, రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలకు కనీసం 45 రోజుల గడువివ్వాలంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై గురువారం నిర్ణయాన్ని వెల్లడించింది.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసిన నాటినుంచి 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు వీలుగా గడువు కుదిస్తూ ప్రభుత్వం ఇదివరకే జారీ చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ, పాత పద్ధతిలోనే జిహెచ్‌ఎంసి ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించింది. అసలు ఎన్నికల ప్రక్రియ గడువు కుదించే హక్కు సర్కారుకుందా? అన్న విషయంపై తర్వాత విచారిస్తామని పేర్కొంది. రిజర్వేషన్లకు మరింత సమయం కావాలన్న అడ్వొకేట్ జనరల్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ఈనెల 9వ తేదీ (శనివారం)లోపు డివిజన్ల రిజర్వేషన్లు ప్రకటించాలని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తమకు 31 రోజుల గడువుకావాలని కోరటంతో న్యాయస్థానం రిజర్వేషన్లు ప్రకటించిన నాటినుంచి 31 పనిరోజుల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఆదేశించింది. కోర్టు తాజా ఆదేశాలతో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో పోలింగ్ జరిగే అవకాశం లేదనే చెప్పొచ్చు.
కోర్టు తాజా ఆదేశాలతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి రెండోవారానికి ముగిసే అవకాశముంది.
కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: మర్రి
జిహెచ్‌ఎంసి డివిజన్ల రిజర్వేషన్లు, ఎన్నికల ప్రక్రియ గడువువంటి విషయాల్లో సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహారించటంపై తాము చేసిన పోరాటం ఫలించిందని న్యాయస్థానంలో ‘పిల్’ దాఖలు చేసిన మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైకోర్టు ఉత్తర్వులు తాను స్వాగతిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య విలువలు కాలరాసేలా చేసిన కుట్రను తాము విజయవంతంగా అడ్డుకోగలిగామన్నారు. డివిజన్ల రిజర్వేషన్లు అధికార పార్టీకి తెలుసని, ఇతర పార్టీలను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నట్టయిందని వివరించారు. సెలవు రోజులను పరిగణనలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు బయటకొచ్చిన తర్వాత 31 రోజులు అంటే దాదాపు 38నుంచి 40 రోజుల మధ్య సమయాన్ని తాము కోర్టు ద్వారా సాధించుకున్నామని శశిధర్‌రెడ్డి అన్నారు.

చిత్రం... హైకోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతున్న మర్రి శశిధర్‌రెడ్డి