తెలంగాణ

మూణ్ణెల్లలో నిర్ణయం తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగష్టు 11: కరీంనగర్ జిల్లా వేములవాడ శాసన సభ్యుడు చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం వివాదం కేసును గురువారం నాడు న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గోగయ్, జస్టిస్ ప్రపుల్ల సి పంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 2009లో చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ హైకోర్టు ఆశ్రయించడంతో పాటు, కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశారు. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని 2013లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత ఈకేసు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన చెన్నమనేనికి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఇవ్వడం జరిగింది. 2009- 2014లలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.