తెలంగాణ

జీవో 190లో స్పష్టత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: మెదక్ జిల్లా నిమ్జ్ ఏర్పాటుకు ఉద్దేశించి భూములను సేకరించిన నేపథ్యంలో నిర్వాసితులకు పునరావాస సదుపాయం కల్పించే విషయమై జారీ చేసిన జీవో 190లో స్పష్టత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో ఎంఎస్ 123ను సింగిల్ కోర్టు జడ్జి రద్దు చేయడం, దీనిపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అపీల్‌కు వెళ్లింది. ఈ అంశంపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్రప్రభుత్వం రైతు కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన కార్మికులకు లబ్ధి చేకూర్చే విధంగా వారికి నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా జీవో 190ను ఈ నెల 10వ తేదీన జారీ చేసిందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని జీవో బాధితులయ్యే వారికి ఉద్యోగాల కల్పనపై ఎటువంటి ప్రస్తావన లేదని పేర్కొంది. బాధితులకు 20 సంవత్సరాల పాటు నెలకు రెండు వేల రూపాయల చొప్పున సొమ్మును చెల్లించే విషయమై నిర్ణయం తీసుకున్నారా అని హైకోర్టు అడిగింది. ఉమ్మడి కుటుంబం అనే అంశంపై కూడా జీవోలో స్పష్టత లేదని హైకోర్టు పేర్కొంది. తాము ప్రస్తావించిన అభ్యంతరాలపై ఈ నెల 16వ తేదీన కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలుచేయాలని హైకోర్టు ఆదేశించింది. తల్లి, తండ్రి, అవివాహిత పిల్లలు ఉమ్మడి కుటుంబం పరిధిలోకి వస్తారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు.