తెలంగాణ

యథాతథంగా జోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరిస్తూ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోన్న నేపథ్యంలో రాష్టప్రతి ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న జోనల్ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, సిబ్బంది, గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఒక్క తహిసీల్‌దార్ల సంఘం మాత్రమే జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కొత్త జిల్లాలపై అధ్యయనానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, సభ్యులు మరో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, సిసిఎల్‌ఎ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ తదితరులు శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఉద్యోగుల విభజన, కేటాయింపు, జోనల్ వ్యవస్థ తదితర అంశాలపై సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ సందర్భంగా జోనల్ వ్యవస్థ ఉండాల్సిందేనని, వెనకబడిన జిల్లాలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగకుండా రాష్టప్రతి ఉత్తర్వుల మేరకు జోనల్ వ్యవస్థను ఇక ముందూ కొనసాగించాలని టిఎన్‌జివోల సంఘ నేతలు దేవిప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, హమీద్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పద్మాచారి, నరేందర్‌రావు తదితరులు సూచించారు. ఉమ్మడి ఆంధ్రలో రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఐదు, ఆరు జోన్లు మాత్రమే మిగిలాయన్నారు. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే 14 జిల్లాలతో కలిసి రాష్ట్రంలో మొత్తం 24 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో ఆరు జిల్లాలకు ఒకటి చొప్పున జోన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రివర్గ ఉప సంఘానికి సూచించాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేస్తే వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుందని వివరించారు. కొత్త జిల్లాలకు కేటాయించే ఉద్యోగులకు రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగులకు కల్పించిన విధంగా అప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగిందని టిఎన్‌జివో నాయకులు దేవిప్రసాద్, రవీందర్‌రెడ్డి వాపోయారు. జరిగిన అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీర్చాలని వారు సూచించారు. కొత్త జిల్లాలకు కేటాయించే ఉద్యోగులకు 20 శాతం హెచ్‌ఆర్‌ఎ ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు పద్మాచారి కోరారు. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతకు మొదటి ప్రాధాన్యత, సీనియార్టీకి రెండవ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రూప్-1 కేడర్‌ను ప్రస్తుతం మాదిరిగా స్టేట్ కేడర్‌గా కొనసాగించాలని గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మంత్రివర్గ ఉప సంఘానికి సూచించారు. గ్రూప్-3, గ్రూప్-2 పోస్టులలో సీనియర్ అసిస్టెంట్స్ స్థాయి నుంచి స్టేట్ కేడర్‌గా పరిగణించాలని వారు సూచించారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న శుభసందర్భంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఎరియర్స్‌ను దసరా పండుగ కానుకగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
chitram...
మీడియాతో మాట్లాడుతున్న
కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు