ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం/పటమట, ఆగస్టు 12: కృష్ణా పుష్కరాల తొలిరోజు శుక్రవారం విజయవాడలో అపశ్రుతులు దొర్లాయి. పండింట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా వున్న పద్మావతి ఘాట్‌లో ఐదేళ్ల బాలుడు కిరణ్ కుమార్ పడి మృతి చెందాడు. మర్వాడి గుడి దగ్గరలోని పద్మావతి ఘాట్ చివర మధ్యాహ్నం 3 గంటల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ఘాట్‌ను శుభ్రం చేస్తుండగా బాలుడు ఘాట్ నీటిలో మృతి చెంది పడి వుండటాన్ని గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. బాలుడు అడుకొంటూ ఘాట్‌లో పడి మృతి చెంది వుండోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఉదయం నుండి బాలుడు కల్పించకపోవడంతో తల్లిండ్రులు బాలుడి కోసం మర్వాడి గుడి పరిసర ప్రాంతాలలో వెదికారు. ఇంతలోనే బాలుడు మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రుల సమాచారం తెలియటంతో పద్మావతి ఘాట్ వద్దకు చెరుకుని కన్నీరు మున్నీరయ్యారు. కాగా, బాలుని మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
మరోవైపు పుష్కరాల విధి నిర్వహణలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌ను కారు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదం గూడవల్లి వద్ద చోటు చేసుకుంది. గన్నవరం పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లాకి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు (హెచ్‌సి 1530) పుష్కర డ్యూటీ నిమిత్తం ఇక్కడికి వచ్చారు. శుక్రవారం ఉదయం గూడవల్లి వద్ద, అయిదో నెంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ విధి నిర్వహణలో ఉండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యానికి విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తరలించగా, వెంకట్రావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. విశాఖజిల్లా మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారానికి చెందిన శీలం దొరబాబు (30) స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాలతో బాధపడుతున్న దొరబాబు జీవితంపై విరక్తి చెంది పుష్కరాల పుణ్యకాలంలో చనిపోదామని వచ్చి కృష్ణానదిలో దూకాడు. అతన్ని గమనించిన గజ ఈతగాళ్లు అతనిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.
రూ.10 లక్షలు పరిహారం
మరణించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రధానంగా మరో ఐదు లక్షల ప్రమాద బీమా, పోలీస్ వితంతు నిధి నుంచి మరో రూ.40 వేలు సహాయం లభిస్తుంది.