తెలంగాణ

26న సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సైదాబాద్, జనవరి 7: తెలంగాణ జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భారత గణతంత్య్ర దినోత్సవం రోజున క్షమాబిక్ష పొందిన దాదాపు 300మంది ఖైదీలను విడుదల చేస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. క్షమాబిక్ష ఖైదీలకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి నివేదికలందాయని, వారి విడుదలకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గురువారం సిటీ పోలీసు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే పునశ్ఛరణ తరగతుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ తెలంగాణలోని జైళ్లను సంస్కరణల నిలయాలుగా తీర్చిదిద్దడానికి జైళ్లశాఖ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. విద్యాదాన్ కార్యక్రమంతో ఖైదీలను విద్యావంతులుగా చేయడమే కాకుండా, మహా పరివర్తన్‌తో శిక్షాకాలం పూర్తిచేసుకున్న ఖైదీలు సమాజంలో తిరిగి గౌరవంగా స్థిరపడేలా సంస్కరణలు అమలు చేస్తున్న తెలంగాణ జైళ్లశాఖ అధికారులను ఆయన ప్రశంసించారు. జైళ్లశాఖ స్వీయ ఆర్ధిక స్వావలంబన సాధిస్తుందని పేర్కొన్నారు. జైళ్లశాఖకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చంచల్‌గూడ జైలు తరలింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు. తెలంగాణ జైళ్లశాఖ ఐజి ఆకుల నర్సింహ్మ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే పునశ్ఛరణ తరగతులలో డిప్యూటీ సూపరిండెంట్‌లు, సూపరిండెంట్‌లతో సహా ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు. తరగతులలో ఖైదీల రక్షణ, ఖైదీల ఆరోగ్యం, ఖైదీలచే తయారు చేయబడే ఉత్పత్తుల మార్కెటింగ్, అవినీతిరహిత జైళ్లశాఖ వంటి అంశాలపై చర్చలు జరుపుతామని వివరించారు.

పునశ్చరణ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హోంమంత్రి

వికటించిన మధ్యాహ్న భోజనం

20 మంది విద్యార్థులకు అస్వస్థత నిర్మల్, దస్తురాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స

కడెం, జనవరి 7: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని మున్యాల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తిన్న మధ్యాహ్న భోజనం వికటించడంతో 20 మంది విద్యార్థిని, విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మున్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోజులాగానే గురువారం మధ్యాహ్నం మధ్యాహ్న భోజన నిర్వాహకులు అన్నంతోపాటు టమాటా, ఆలుగడ్డ,వంకాయ కలిపి కూర వంటకాలు చేశారు. మధ్యాహ్న సమయంలో విద్యార్థులు ఈ భోజనాన్ని తిన్నారు. కాగా సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న దాదాపు 20 మంది విద్యార్థిని, విద్యార్థులకు తల తిరగడం, వాంతులు, విరేచనాలకు గురి అస్వస్థతకు పాలయ్యారు. మున్యాల్ గ్రామసర్పంచ్ సంతోష్‌కుమార్, స్థానిక ఎంపిటిసి విజయలక్ష్మి స్వామి, పాఠశాల ఉపాధ్యాయులు,గ్రామస్తులు పై విద్యార్థులను తమ ప్రత్యేక వాహనాలతో దస్తురాబాద్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చేకిత్సలకు చేర్పించారు. మున్యాల్ పాఠశాలకు చెందిన 7,8,9,10 తరగతి విద్యార్థిని, విద్యార్థులు లత,రమ, సరిత, హరిత, రమ్య, అనూష, గోపాల్, సాగర్, కృష్ణవేణి, నాగలక్ష్మి, రవళి, గంగోత్రి, రాజు, రమ్య, పద్మావతిలు అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు.

పోలీసుల వేధింపులకు భయపడి
నలుగురు యువకుల ఆత్మహత్యాయత్నం

కోహెడ, జనవరి 7: పోలీసుల వేధింపుల భయానికి నలుగురు యువకులు ఆత్మహత్యకు ఒడిగట్టారు. కరీంనగర్ జిల్లాలో సిద్దిపేట నుండి హన్మకొండకు వెళ్లే ప్రధాన రహదారిలో మండలంలోని క్రాస్ రోడ్ వద్ద గురువారం మిట్టమధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన బోయిని సురేష్ (26), బోయిని రఘు (25), గడిపె సాగర్ (26), బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కొంకట సృజన్ (25) రెండు ద్విచక్ర వాహనాలపై మెదక్ జిల్లా రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ మార్గమధ్యంలో సముద్రాల క్రాస్ రోడ్ వద్ద ప్రధాన రహదారి పక్కన వాహనాన్ని నిలిపి మద్యం తాగి ఆపై క్రిమిసంహారక మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని రహదారిపై వెళ్తున్న వారు గమనించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. దీంతో హుస్నాబాద్ ఆసుపత్రికి వీరిని తరలించారు. ప్రస్తుతం వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. అయితే నవాబుపేట గ్రామానికి చెందిన బోయిని శంకర్, రజని ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకోగా వీరి పెళ్లికి సదరు యువకులు సహకరించారని అమ్మాయి బంధువులు మెదక్ జిల్లా నంగునూరుకు చెందిన వారు కావడంతో అక్కడి సమీపంలోని రాజగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో గత వారం రోజుల నుండి సదరు యువకులను అక్కడి పోలీసులు విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.

తల్లిదండ్రుల అమానుషం

నాలుగేళ్ల చిన్నారికి నరకయాతన

పటన్‌చెరు, జనవరి 7: నాలుగేళ్ల కుమారుడిని కన్నవాళ్లేచిత్రహింసలకు గురిచేశారు. ప్రస్తుతం బాలుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెదక్ జిల్లా పటన్‌చెరు పట్టణ పరిధిలోని శాంతినగర్‌లో గురువారం జరిగింది. గత మూడు రోజులుగా బాలుడిని అతని తల్లి, తండ్రి అతి క్రూరంగా హింసిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆసుపత్రికి తరలించారు. ఒక పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న మేళసంగం శివకుమార్, రాధ ఇద్దరూ భార్యభర్తలు. వారికి నాలుగేళ్ల కొడుకు మనోహర్ ఉన్నాడు. కొడుకును ఇంతవరకు ఇప్పటివరకూ పాఠశాలలో చేర్చలేదు. కేవలం ఇంటి బయట ఆడుకుంటున్నాడనే కారణంగా తల్లిదండ్రులు మనోహర్‌ను చితకబాదడం మొదలుపెట్టారు. గత మూడు రోజులుగా ఆ చిన్నారిని దారుణంగా హింసించారు. బాలుడి ఎడమ కన్నులోని నల్లని గుడ్డు పక్కన బాగా కమిలిపోయంది. కంటి బయట కర్రతో కొట్టగా బాగా ఉబ్బిపోయింది. దవడ కింది భాగం బ్లేడుతో కోసినట్లు ఉంది. దారుణాన్ని చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు బాలుడిని తల్లిదండ్రుల చెర నుండి విడిపించి పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రికి తరలించారు. చైల్డ్ లైన్ మెదక్ జిల్లా డైరెక్టర్ సుభాష్‌చందర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాలుడి తల్లిదండ్రులను విచారించారు. బాలుడికి చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సిఐ లింగేశ్వర్ విచారం చేపట్టారు.

ఐసిడిఎస్ బిల్లుల స్వాహా
భద్రాచలం, జనవరి 7: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన కూనవరం, చింతూరు, ఎటపాక ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ ఆయాలు, కార్యకర్తల బిల్లులకు సంబంధించి కోటి రూపాయల వరకు స్వాహా అయ్యాయి. దీనిపై అంగన్‌వాడీ ఆయాలు, కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఉన్నతాధికారుల నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. 2014 సెప్టెంబర్ నుంచి 2015 అక్టోబర్ నెల వరకు అమృతహస్తం, ఆయాలు, అంగన్‌వాడీ వర్కర్ల టిఎ, డిఎలు, గ్యాస్‌బిల్లులు, ప్రి స్కూల్ పిల్లల బిల్లులు రావాల్సి ఉంది. వీరంతా బిల్లులు సమర్పించారు. బడ్జెట్ రాలేదని కాలయాపన చేస్తూ వీరిని అప్పటి సీడీపీఓ మూడు ప్రాజెక్టులకు ఇంఛార్జ్‌గా ఉన్న అధికారి, యుడిసిలు సమాధానం దాటవేశారు. పక్క ప్రాజెక్టు వరరామచంద్రాపురం పరిధిలోని అంగన్‌వాడీ ఆయాలకు, కార్యకర్తలకు మాత్రం బిల్లులు వచ్చాయి. సీడీపీఓ, యుడీసీలు వీటిని కైంకర్యం చేశారని పసిగట్టారు.