తెలంగాణ

జోనల్ విధానం వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: జోనల్ విధానం రద్దు చేయాలని, దాని స్థానంలో జిల్లా, రాష్ట్ర విధానం ఉండాలని టిఎన్‌జివో రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో జోనల్ విధానంపై సమావేశంలో చర్చించారు. జోనల్ విధానం స్థానంలో జిల్లా, రాష్ట్ర విధానం ఉండాలని నిర్ణయించారు. అన్ని జిల్లాలకు న్యాయమైన వాటా ఉండాలని, ప్రస్తుతం ఉన్న జోనల్ ఉద్యోగులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలని టిఎన్‌జివో రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, హమీద్ కోరారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
అధికారులు సర్దుకుంటున్నారు
దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కావడం ఖాయం అని తేలిపోవడంతో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ఉద్యోగులను జిల్లాలకు కేటాయింపుపై సమావేశాలు ప్రారంభించారు. రవాణా శాఖ కమిషనర్ మంగళవారం ఆర్‌టిఎలతో సమావేశం అయ్యారు. పది జిల్లాల తెలంగాణ 24 జిల్లాలుగా మారుతున్నందున కొత్తగా పదోన్నతులు, ఉద్యోగుల బదిలీలు ఏ విధంగా ఉంటాయనే దానిపై చర్చించినట్టు తెలిసింది. కొత్త జిల్లాలు దసరాకు ఏర్పాటు అయినా పూర్తి స్థాయిలో పని చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు వంటి వాటికి కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. జోనల్ విధానం సమస్యగా మారుతుందనే ఉద్దేశంతో, దానిని తొలగించాలని టిఎన్‌జివో సంఘం క్యాబినెట్ సబ్ కమిటీకి సూచించింది. మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో సైతం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.