తెలంగాణ

కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్/నిజామాబాద్/ కరీంనగర్ /మెదక్/నల్లగొండ/ఆదిలాబాద్/వరంగల్, జనవరి 7: దీర్ఘకా లంగా పెండింగ్‌లో ఉన్న ఫీజుల రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో విద్యార్థులు అందోళనకు దిగారు. కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం పలు జిల్లాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో వేలాది మంది విద్యార్థులు జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. న్యూటౌన్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టర్ కార్యాలయంలోకి చోచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏబివిపి నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసు కున్నాయ. కలెక్టర్ కార్యాలయ ప్రధాన ద్వారం దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీలు జులిపించారు. కరీంనగర్‌లో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట, పిడిగుద్దులు, ముష్టి ఘాతాలతో కలెక్టరేట్ పరిసరాలు దద్దరిల్లాయి. లాఠీచార్జీలో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలు కాగా, వారిని ఆస్పత్రుల్లో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. పలు కళాశాలలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు మహార్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఎబివిపి ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సర్వేష్ మాట్లాడుతూ ఉపకార వేతనాలు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో ఎబివిపి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు, విద్యార్ధుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్ధులు ఫీజుపోరును తీవ్రం చేసేందుకు కంకణం కట్టుకోవడంతో పోలీసులకు, విద్యార్ధులకు మధ్య తోపులాటలు జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్జి చేయడంతో పరుగులు తీశారు. కాగా, ఫీజులకోసం ధర్నా చేస్తే విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దురదృష్టకరమని, లాఠీచార్జిని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి ఏబివిపి పిలుపునిచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఏబివిపి చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చిన విద్యార్థులు సిఎం డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఒక దశలో విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎబివిపి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారి తీసింది. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టి, సుమారు 50మంది ఎబివిపి కార్యకర్తలను అరెస్ట్ చేసి నాల్గవటౌన్‌కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎబివిపి అధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి అరెస్టులకు దారితీసింది. ఏబివిపి అధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట బైటాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ను ముట్టడించి లోనికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా అప్పటికే భారీ ఎత్తున మోహరించిన పోలీసులు విద్యార్థులను, నాయకులను లాఠీలతో చెదరగొడుతూ అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల అవలంభిస్తున్న మొండివైఖరిని ఈ సందర్భంగా వారు ఎండగట్టారు.

నల్లగొండ కలెక్టరేట్ వద్ద విద్యార్థులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లోకి దూకుతున్న విద్యార్థులు

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లోకి దూకుతున్న విద్యార్థులు