తెలంగాణ

నిమ్జ్ భూసేకరణకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: మెదక్ జిల్లా నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు నిమిత్తం భూముల కొనుగోలుకు ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 123 కింద భూమి కొనుగోలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. కాని భూమి యజమానులు, బాధితులు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చమని, ఈ నెల 9వ తేదీన తెలంగాణ ఏజి కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు అన్నిరకాలుగా కోర్టు సంతృప్తిపడేంత వరకు పిటిషన్లు పెండింగ్‌లో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. ఈమేరకు ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ దుర్గాప్రసాద్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. జీవో 123కు అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 190, దానిని సవరిస్తూ జీవో 191లోని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కోర్టు పేర్కొంది. వ్యవసాయ కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు సంతృప్తి కలిగించే విధంగా నష్టపరిహారం చెల్లించే విధంగా జీవో 190ను అమలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తెలంగాణ ఏజి రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ అన్ని వర్గాలకు, ప్రధానంగా భూమి లేని నిరుపేదలకు నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. పారిశ్రామిక విధానం కింద తెలంగాణ రాష్ట్రానికి చెందిన 80 శాతం మందికి ఉద్యోగాలను పరిశ్రమలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని భూమి లేని నిరుపేదలకు, బాధితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుకుంటున్నామని తెలిపింది. బాధితుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిరుపేదలకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్టమైన హామీ ఇవ్వడంలేదని కోర్టుకు తెలిపారు. హైకోర్టు జోక్యం చేసుకుని పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు పరిశీలనలో కొనసాగుతాయని, తాము సూచించినట్లుగా ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసే వరకు అవసరమైన సూచనలు, చర్యలు తీసుకుంటామని తెలిపింది. అనంతరం ఈ కేసును నాలుగు వారాలపాటు కోర్టు వాయిదా వేసింది.