తెలంగాణ

ఇక గోదావరి పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఒకవైపు పనులు వేగంగా సాగిస్తుండగా, మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణల మధ్య మహా ఒప్పందానికి సర్వం సన్నద్ధం అయింది. మరోవైపు టెండర్ల ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకుంది. సూత్రప్రాయంగా మహారాష్ట్ర ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ పనులు, ఎత్తిపోతలకు అవసరం అయిన పంపులు, పరికరాలను సమకూర్చుకుంటున్నది. ఈనెల 23న అధికారికంగా తుది ఒప్పందం కుదరనుంది. దీంతో రికార్డు సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యానికి మార్గం సుగమం అయింది. మొదటి దశలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడు బ్యారేజీలు నిర్మించనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రెండవ దశలో గజ్వేల్ నియోజక వర్గంలోని తడ్కపల్లిలో 50 టిఎంసిలు, కొండపోచమ్మ వద్ద 21 టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ప్రాణహిత- చేవెళ్ల డిజైన్‌లో భాగంగా 44 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వారు. పలు నిర్మాణ పనులు కూడా జరిగాయి.
ఈ కెనాల్ ప్రిజమ్‌నే రిజర్వాయర్‌గా వాడుకోవాలని ప్రభుత్వం రీ డిజైనింగ్ చేసింది. 44 కిలో మీటర్ల పొడవున తవ్విన కాలువే రిజర్వాయర్‌గా మారుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాణహిత- చేవెళ్ల ప్యాకేజీ 5లో 72 కిలో మీటర్ల వద్ద 160 టిఎంసిల నీరు, 39 మీటర్లు లిఫ్ట్ చేయడం వల్ల ఎల్లంపల్లికి చేరుతాయి. ఆదిలాబాద్‌లో 56,500 ఎకరాలలో 36వేల ఎకరాల ఆయకట్టు ఈ లిఫ్ట్ తర్వాతే ఉంటుంది. రీ ఇంజనీరింగ్‌లో భాగంగా లిఫ్ట్ మేడిగడ్డకు మారుతుంది. అక్కడి నుంచి వరుస బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి చేర్చనున్నారు. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించడానికి అంగీకరించేది లేదని 148 మీటర్ల వరకు అయితే అభ్యంతరం లేదని మహారాష్ట్ర చెప్పడంతో ఆ మేరకు ఒప్పందానికి ఇరు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత 273 టిఎంసిలు కాదని, 165 టిఎంసిలని కేంద్ర జలసంఘం లెక్క కట్టింది. 160 టిఎంసిల నీటి తరలింపు సాధ్యం కానందున 120 టిఎంసిల నీటిని తరలించడానికి తెలంగాణ, మహారాష్ట్ర సూత్రప్రాయంగా అవగాహనకు వచ్చాయి.
మేడిగడ్డ వద్ద 100 మీటర్లకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర తెలిపింది. తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ సామర్ధ్యం 1.85 టిఎంసిలు కాగా, మేడిగడ్డ వద్ద సులభంగా 16 టిఎంసిల స్కోరేజీ కెపాసిటీ లభిస్తుంది. కాళేశ్వరంలో అత్యంత ముఖ్యమైన 9 పంపు హౌజ్‌లు, 9 సబ్ స్టేషన్ల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే సాగుతోంది. 2015 ఫిబ్రవరి 17న కెసిఆర్ తొలిసారి ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చించారు. మార్చి 8న రెండవ సారి సమావేశం అయ్యారు. పలు ధపాలుగా చర్చల తరువాత సూత్ర ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆగస్టు 23న తుది ఒప్పందం కుదురుతుంది. ముంభైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో రెండు రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం కుదురుతుంది. ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మహారాష్ట్ర పర్యటనలో పాల్గొంటారు.

చిత్రం..కాళేశ్వరం ప్రాజెక్టు