తెలంగాణ

గ్రీన్ ఫార్మాసిటీ భూసేకరణపై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: రంగారెడ్డి జిల్లా కందకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట గ్రామ పరిధిలో గ్రీన్ ఫార్మా సిటీ నిమిత్తం 493ఎకరాల భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేను జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు మంజూరు చేశారు. ఈ భూమిని తెలంగాణ పరిశ్రమలు వౌలిక సదుపాయాల సంస్థకు కేటాయించడం, తమకు రెవెన్యూ అధికారులు నోటీసు ఇవ్వడంపై మద్ది భారతమ్మ మరో 16 మంది హైకోర్టును ఆశ్రయించారు. టిఎస్‌ఐఐసి భూమి యజమానుల నుంచి భూమిని కొనుగోలు చేసేందుకు నిరుడు జూలై 22వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను కూడా పిటిషనర్లు సవాలు చేశారు. 2013 భూసేకరణ చట్టం స్ఫూర్తికి, మార్గదర్శకాలకు జీవో 45 విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్లు తరఫున న్యాయవాది ఎన్‌ఎస్ అర్జునకుమార్ వాదనలు వినిపిస్తూ అధికారులు బలవంతంగా భూముల సేకరణకు పాల్పడుతున్నారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్లపై ప్రభుత్వం వత్తిడి తేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్ధించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెవెన్యూ అధికారులు జనరల్ నోటీసును మాత్రమే ఇచ్చారని తెలిపారు. అసైన్డ్ భూములు, భూమి యజమానుల అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నోటీసులు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వం రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. కేసును 8వారాల పాటు వాయిదా వేశారు.