తెలంగాణ

రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండపాక, ఆగస్టు 17: ఉన్నతస్థాయి అధికారుల వేధింపులు, ధనదాహార్తి తట్టుకోలేక ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెంకు చెందిన ఉస్తెల రామకృష్ణారెడ్డి (38) కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు తన సర్వీస్ రివాల్వర్‌తో కణతకు కాల్చుకొని రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతధికారులైన సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్, సిద్దిపేట రూరల్ సిఐ వెంకటయ్య కొంతకాలంగా మామూళ్ల కోసం అనునిత్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎస్పీకి రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. గత మూడు నెలలుగా 15 లక్షల రూపాయలు డిఎస్పీకి మామూళ్లు ఇస్తూ వచ్చానని, సిఐకి గత ఎనిమిది నెలలుగా మామూళ్లు ఇస్త్తూ వచ్చానని పేర్కొన్నారు. అయినా ఇంకా మామూళ్లు కావాలని ప్రతి విషయంలో తనను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారన్నారు. డిఐజి కూడా తాను చేయని పనులను కూడా చేశావంటూ ఒక్కొక్కరి దగ్గర ఎంత మామూళ్లు తీసుకున్నావని వేధింపులకు గురిచేసినట్లు ఆ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. అలాగే ఇటీవల గజ్వేల్‌లో జరిగిన పిఎం సభకు 2 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు చేశానని, ప్రస్తుతం తన వద్ద డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని ఉన్నతాధికారులకు తెలిపినా ఆ విషయం తమకు చెప్పాల్సిన అవసరం లేదని, నువ్వే పెట్టుకున్నావు, నీ ఇష్టమంటూ దాటవేశారని ఆ నోట్‌లో వాపోయారు. పోలీస్‌స్టేషన్‌ళో పనిచేస్తున్న ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు యాదిరెడ్డి, రాజు కూడా తన మాట వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి ఇబ్బందులకు గురిచేసేవారని తెలిపారు. ‘ఎస్పీగారు.. నన్ను అర్థం చేసుకోండి, నేను ఎలాంటి తప్పులు చేయలేదు.. మీ డిఎస్పీ, సిఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పెడుతున్న ఇబ్బందులతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. తన చావుకు వీళ్లే కారణమని సూసైడ్‌నోట్‌లో తెలిపారు.
ఎస్పీగారంటే ఎంతో అభిమానమని, ఆయన ఎన్నోసార్లు ఇబ్బందుల గురించి చెప్పాలనుకున్నా సమయం దొరకలేదన్నారు. పిసిలు, హెచ్‌సిలు, ఎఎస్‌ఐ, పిసి నాగిరెడ్డి, హెచ్‌సి ముత్యం, సముదాని, నహీం, ఎఎస్‌ఐ ప్రకాష్, సిఐ కలిసి తనమీద కుట్రలు చేశారని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి గజ్వేల్ ఎస్‌ఐ సతీష్‌కు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని, తన చావుకు ఉన్నతాధికారులే కారణమని పేర్కొన్నారు. గజ్వేల్ ఎస్‌ఐ సతీష్ ఫోన్ మాట్లాడుకుంటూ కుకునూరుపల్లికి చేరుకునేలోపే సర్వీస్ రివాల్వర్‌తో కణతపై పేల్చుకొని ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి మృతి చెందారు. తన డ్రైవర్ కరుణాకర్‌కు ఫోన్ చేసి తన పిల్లలు జాగ్రత్త అని చెప్పారని తెలిసింది. రాత్రి ఒంటి గంట సమయంలో కాల్పుల శబ్ధం వినిపించడంతో స్టేషన్ సిబ్బంది అప్రమత్తమై ఎస్‌ఐ క్వార్టర్‌లోకి వెళ్లి చూడగా రామకృష్ణారెడ్డి మృతి చెంది ఉన్నారని, వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి తరలించినట్లు కుకునూరుపల్లి పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డికి భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
‘అధికారుల వేధింపుల వల్లే నా భర్త ఆత్మహత్య’
మామూళ్ల కోసం ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి భార్య ధనలక్ష్మి ఆరోపించారు. ఉన్నతాధికారులకు మామూళ్లు ఇచ్చేందుకు తమ అన్నకు రామకృష్ణారెడ్డి లక్ష రూపాయలు అప్పుగా తెమ్మని చెప్పారని, 4, 5 రోజులుగా సెలవులు రాకపోవడంతో లక్ష రూపాయలు తేవడం ఆలస్యమైందన్నారు. అధికారులు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని చెప్పేవారని, ఉద్యోగానికి రాజీనామా చేసి తమ ఊరికి పోదామని నిర్ణయం కూడా తీసుకున్నామని ఆమె తెలిపింది. రెండు రోజుల కిందనే తాను పుట్టింటికి వెళ్లానని, మంగళవారం రాత్రి ఫోన్ చేసినప్పుడు టివి చూస్తున్నట్లు తన భర్త చెప్పారని తెలిపింది. ఫోన్ చేసిన 2, 3 గంటల తర్వాతే కాల్చుకున్నట్లు తనకు ఫోన్ వచ్చిందని తెలిపింది.

చిత్రాలు.. కణతపై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి * ఎస్పీకి రాసిన సూసైడ్ నోట్