తెలంగాణ

జోగులాంబ సన్నిధిలో శతచండీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్/అలంపూర్, ఆగస్టు 18: కృష్ణా పుష్కరాల్లో భాగం గా గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలోని దక్షిణ కాశీగా పిలువబడే అలంపూర్ జోగులాంబదేవి పుణ్యక్షేత్రంలో శతచండియాగం ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీ నుండి 24 వరకు ఐదవశక్తిపీఠం జోగులాంబ సన్నిధిలో యాగం కొనసాగనుంది. వేదమంత్రోచ్చరణల మధ్య, శాస్రోక్తంగా ప్రారంభమైన శతచండియాగానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ యాగంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సైతం యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మా ట్లాడుతూ చండియాగంతో రాష్ట్రం సుబిక్షంగా ఉంటుందని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ యాగం యొక్క ఫలితం లభిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకే ఐదవశక్తి పీఠం జోగులాంబదేవి సన్నిదిలో చండియాగం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. కృష్ణా పుష్కరాలు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్గొం డ జిల్లాల్లో కొనసాగుతున్నప్పటికిని లక్షలాది మంది ప్రజలు వచ్చి కృష్ణమ్మన దర్శించుకుని పుణ్యస్నానాలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఇప్ప టి వరకు పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏడు రోజుల కృష్ణా పుష్కరాల్లో 78 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు తాము అంచన వేసినదానికంటే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి పుణ్యస్నానాలు చేస్తుండడంతో తెలంగాణ రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం చేసిన వారి సంఖ్య కోటి దాటే అవకాశం ఉందని తెలిపారు. నల్గొండ జిల్లాలో కూడా కృష్ణా పుష్కరాలు విజయవంతంగా కొనసాగుతుందన్నాయని వెల్లడించారు. పొరుగు రాష్టల్రైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు సంబందించిన మహబూబ్‌నగర్ జిల్లాకు సమీపంలో గల రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా ఇక్కడి వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశంసలతో ప్రజలు ముంచేత్తుతున్నారని తెలిపారు.
ఐదవశక్తిపీఠంలో తమ దంపతులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శతచండియాగంలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడంతో తమ జన్మ దన్యమైందని మంత్రి పెర్కోన్నారు. జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరి స్వామి ఆశీస్సులు యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఉండాలని మొక్కుకున్నానని బంగా రు తెలంగాణకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషికి అమ్మవారు మరింత బలాన్ని ఇవ్వాలని మంత్రి ఆకాంక్షించారు.

చిత్రం.. అలంపూర్‌లోని ఐదవశక్తి పీఠం జోగులాంబ అమ్మవారి ఆలయంలో
శతచండీయాగంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు