తెలంగాణ

నిజాయితీని శంకించకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: నరుూం, అతని అనుచరుల ఆగడాల నేరాలు, కేసులపై పూర్తిస్థాయి వృత్తిపరమైన నైపుణ్యంతో సిట్ దర్యాప్తు చేస్తోందని సిట్ చీఫ్ నాగిరెడ్డి ప్రకటించారు. నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్షలుపడేలా కోర్టుకు ఆధారాలు సమర్పిస్తామన్నారు. ఈ విషయంలో సిట్ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. తమకు సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈమేరకు ఆయన ప్రకటన విడుదల చేస్తూ, కేసుపై సిట్ దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి పలు భూమి డాక్యుమెంట్లు, అక్రమంగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి, బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా తాము ఫయాజ్ అలియాస్ అమీర్ అనే నరుూమ్ అనుచరుడిని శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో అరెస్టు చేసి విచారించి జ్యుడీషియల్ కస్టడీకి పంపామన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని దర్యాప్తుచేసి తాజాగా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. నరుూం, అనుచరుల ఆగడాలు, నేర కార్యకలాపాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేసుల్లో ప్రమేయమున్న నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇంతవరకు 30 కేసులు ఐదు జిల్లాల్లో నమోదు చేసినట్టు చెప్పారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 14 కేసులు, సైబరాబాద్ పరిధిలో 7, పాలమూరులో 4, కరీంనగర్‌లో 4, నిజామాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. మీడియా వాస్తవ విరుద్ధమైన కథనాలు ప్రచురించడం వల్ల ప్రజల్లో అపనమ్మకం తలెత్తుతోందన్నారు.
నలుగురి అదృశ్యంపై సిట్ ఆరా
నరుూంకు చెందిన వుప్పలగూడ ఇంటి నుంచి నలుగురు వ్యక్తులు అదృశ్యమైన ఘటనకు సంబంధించి వివరాలను సిట్ సేకరించింది. కానీ ఈ వివరాలను త్వరలో వెల్లడిస్తామని సిట్ వర్గాలు తెలిపాయి. నరుూం అక్క భర్త నదీమ్ అలియాస్ విజయ్‌కుమార్, తమ్ముడు అలీముద్దీన్ భార్య హీనా, అతని కుమార్తె చియాన్, బంధువైన పనిమనిషి నస్ర్తిన్‌లు గత కొనే్నళ్లుగా కనపడడం లేదు. వీరు నరుూం చేతిలో హత్యకు గురయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిని ఖననం చేసినట్టుగా చెబుతున్న ప్రదేశాలను పోలీసులు గుర్తించినట్టు సమాచారం.