తెలంగాణ

అసదుద్దీన్‌కు ఐసిస్ బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియా (ఐసిస్) నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఐసిస్ గురించి తెలియకపోతే నోరు మూసుకోవాలని ట్విట్టర్‌లో బెదిరింపు వచ్చింది. ఇటీవల ఐసిస్ పారిస్‌పై జరిపిన దాడుల నేపథ్యంలో ఐస్‌ఐఎస్‌ఐ ఇస్లాం మతానికి వ్యతిరేకమని ఎంపి అసదుద్దీన్ ఒవైసీ దేశంలోని పలు సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రకటనలు చేశారు. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులను రేపిస్టులు, హంతకులుగా అసదుద్దీన్ అభివర్ణించారు. యువకులను ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని కూడా పలు బహిరంగ సభల్లో హితవు చెప్పారు. ఈ క్రమంలో ఐసిస్ తీవ్రంగా పరిగణిస్తూ అసదుద్దీన్.. ఐసిస్ గురించి తెలియకుంటే నోరు మూసుకో, ఐసిస్ గురించి నీకేం తెలుసు.. అంటూ ఐసిస్ ట్విట్టర్‌లో పేర్కొంది. అదేవిధంగా త్వరలోనే భారత్‌లోనూ ఐసిస్ విస్తరిస్తుందని, దేశంలో దాడులు చేస్తామని కూడా హెచ్చరించినట్టు తెలిసింది. ఇదిలావుండగా ఐసిస్ చేసిన హెచ్చరికలపై ఎంపి అసదుద్దీన్ స్పందించారు. ఏదో ఒక రోజు అందరూ చనిపోవాల్సిందేనని, కొందరు ముందు, మరికొందరు తరువాత చనిపోతారని ఒవైసీ అన్నారు. ఐసిస్ ఇస్లాం మతానికి వ్యతిరేకమని, అది ఒక ఉగ్రవాద సంస్థని, ఎన్ని బెదిరింపులు చేసినా తాను భయపడబోనని అన్నారు. ఇప్పటికే ఐసిస్ దారుణానికి లక్షన్నర మంది ముస్లింలు సమిధులయ్యారని, ఐసిస్ దాడులను ప్రపంచ స్కాలర్లందరూ ఖండించిన విధంగానే తాను ఖండించానన్నారు. ఇస్లాం మతానికి ఐసిస్‌కు ఎలాంటి సంబంధం లేదు, సోషల్ మీడియాలో మాత్రమే ఐసిస్ అంటే ఇస్లాం అని ప్రచారం జరుగుతోందన్నారు. అయితే ఐసిస్ ఒక ఉగ్రవాద సంస్థ, ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నానని ఎంపి అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
చిత్ర పరిశ్రమను ఆదుకుంటాం

మంత్రి కెటిఆర్ హామీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7: చలనచిత్ర పరిశ్రమను అన్ని విధాల ఆదుకుంటామని సినీ కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం మణికొండలోని చిత్రపురి కాలనీలో ఏర్పాటుచేసిన సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. దాదాపు 15 వేల మంది సినీ కార్మికుల్తున్నారని వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చిత్రపురి కాలనీ రోడ్డుకు 1.50 కోట్లు మంజూరు చేస్తున్నామని, రోడ్డు పనులు వెంటనే చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి జలాలు నగరానికి రప్పించామని 7600 కోట్లతో రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామని, వీటి నిర్మాణంతో నగరానికి త్రాగునీటి అవసరాలు పూర్తిగా తీరనున్నట్లు తెలిపారు. చిత్రపురి కాలనీలో అర్బన్ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని స్థానికలు కోరిన విధంగా చిత్రపూరి కాలనీకి ఆర్టీసి బస్సులు రూట్లలో నడిపిస్తామని అన్నారు. 1900 కోట్లతో నగర శివారులో మంచినీటి కొరత లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ సినీ కార్మికులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఆ దృష్టితోనే ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్‌తోపాటు జిల్లా కలెక్టరు రఘునందన్‌రావు, హెచ్ ఎండిఎ కమీషనర్ చిరంజీవులను ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు.
అదే విధంగా సినీ కార్మికుల గృహ నిర్మాణానికి అధనపు స్థలంపై ముఖ్యమంత్రి దృష్టికి తెస్తానని అన్నారు. ఈ సమావేశానికి సినీ ప్రముఖులు, సినిమాకు సంబంధించిన వివిధ శాఖల సంఘం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.