తెలంగాణ

జిల్లాలు 27..జడ్పీలు తొమ్మిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: దసరాకు కొత్త జిల్లాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలు మొత్తం 27 జిల్లాలుగా అవుతాయి. అయితే జిల్లా పరిషత్తులు మాత్రం మరో రెండున్నర ఏళ్లపాటు ప్రస్తుతం ఉన్న తొమ్మిది అలాగే కొనసాగుతాయి. మండలాధ్యక్షులు మొదలుకొని జిల్లా పరిషత్తుల వరకు ప్రస్తుతం ఉన్న విధానం యధావిధిగా కొనసాగుతుంది. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలకు తొమ్మిది జిల్లా పరిషత్తులు ఉన్నాయి. అదే విధంగా డిసిసి చైర్మన్లు, తొమ్మిది జిల్లా కోర్టులు ఉన్నాయి. దసరా నుంచి జిల్లాలు మారినా, ఇవి మాత్రం అలాగే కొనసాగుతాయి. వీరి పదవీ కాలం ముగిసే వరకు అలానే కొనసాగించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ విషయం తెలిపారు. అనంతరం జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మీడియాకు వివరిస్తూ చట్టప్రకారం జిల్లా పరిషత్తులు యధావిధిగా కొనసాగుతాయని చెప్పారు. ఐదేళ్ల పదవీ కాలం కోసం జిల్లా పరిషత్తు చైర్మన్‌లు, డిసిసిబి చైర్మన్‌లు, మండలాధ్యక్షులు ఎన్నికయ్యారు. గ్రామం మొదలుకుని జిల్లా వరకు అన్నింటి స్వరూపం మారనుంది. అయితే ఐదేళ్ల పదవీ కాలం కోసం ఎన్నికైన వారిని తొలగించేందుకు వీలు లేదని గతంలో వివిధ సందర్భాల్లో కోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ వీటిని అలానే కొనసాగించనున్నట్టు ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశంలో వివరించారు.