రాష్ట్రీయం

ఎంత ధైర్యం మీకు? రాహుల్‌పై వెంకయ్య నిప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: ‘మా సిద్ధాంతాలనే విమర్శించేందుకు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎంత ధైర్యం?’ అని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. తమను విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిజెపిపై, సంఘ్‌పరివార్‌పై రాహుల్ గాంధీ శనివారం చేసిన వ్యాఖ్యలు గురివింద గింజ సామెతలా ఉన్నదని ఆయన దుయ్యబట్టారు. 50 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రజల బాగోగుల గురించి పట్టించుకోకుండా, కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కుల రాజకీయాలు చేసిందని, ప్రజల మధ్య ఐక్యతకు కృషి చేయలేదని ఆయన విమర్శించారు. ఎల్‌టిటిఇని ఎవరు ప్రోత్సహించారు?, వారికి ఎవరు శిక్షణ ఇచ్చారు?, ఆయుధాలు ఎవరు సమకూర్చారు? అని ఆయన ప్రశ్నించారు. 1984లో ఏం జరిగింది? 3400 మంది సిక్కుల ఊచకోతకు కారకులు ఎవరు?, భింద్రన్ వాలా సంగతేమిటీ?, గోల్డెన్ దేవాలయంలోకి ఆర్మీని పంపించింది ఎవరు? ఆ దురాగతానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు మతపరమైన గ్రూపులను కాంగ్రెస్ ప్రోత్సహించిందని ఆయన విమర్శించారు. ముస్లిం-లీగ్‌ను ప్రోత్సహించింది ఎవరు?, రాజకీయ ప్రయోజనాల కోసం మజ్లిస్-ఎ-ఇత్తేహద్-ఉల్-ముస్లిమీన్‌తో, ఇతర మతపరమైన శక్తులతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేతులు కలిపింది ఎవరని వెంకయ్య ప్రశ్నించారు.
జమ్మూ-కాశ్మీర్‌లో ఈ పరిస్థితులు నెలకొనడానికి కారణం ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. జెకెఎల్‌ఎఫ్ పట్ల సానుభూతిగా వ్యవహారించిందని, సిమి వంటి సంస్థల పట్ల ఉదాసీనంగా వ్యవహారించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సామాజిక భద్రత కల్పించేందుకు కష్టపడి పని చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని విడనాడాలని ఆయన సూచించారు.