తెలంగాణ

ఉస్మానియా వైద్యుల ఘనత : ఏకకాలంలో 2 అవయవాల మార్పిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఒకే సమయంలో రెండు అవయవాల మార్పిడి చేసి రికార్డు సృష్టించారు. ఒక అవయవ మార్పిడి సాధారణమే అయినా, రెండు అవయవ మార్పిడులు చేయ డం కష్టసాధ్యం. దాన్ని ఉస్మానియా వైద్యులు సాధించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లివర్, కిడ్నీలను ఇద్దరు రోగులకు ఒకే సమయంలో మార్పిడి చేసి అసాధరణ ప్రతిభ చూపించారు. అరుదైన అవయవ మార్పిడులు చేసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి అభినందించారు.
ప్రైవేటు రంగంలో జరుగుత్నున అవయవ మార్పిడులు, హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పటల్ చొరవతో ప్రభుత్వ ఆస్పత్రులలో జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 30 నుంచి 40లక్షల రూపాయల వ్యయం అయ్యే అవయవ మార్పిడిని ప్రభుత్వ రం గంలో పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటికే కిడ్నీ, లివ ర్, హెయిర్, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి ఉస్మానియా డాక్టర్లు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసాన్ని పెంచారు. కుషాయిగూడలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కూతురు బిటెక్ చదువుతున్న కావ్య (21) కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. 13 ఏళ్ల నుంచి అనేక ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. 30 నుంచి 40లక్షల రూపాయల వ్యయం అవుతుందని డాక్టర్లు చెప్పారు. మేనరికం పెళ్లి చేసుకున్న శ్రీనివాస్‌కు ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో ఇద్దరు కూతుళ్లకు ఈ సమస్య ఉంది. ఉస్మానియాలో ఉచితంగా అవయవ మార్పిడి జరుగుతున్న విషయం తెలుసుకున్న శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని సంప్రదించారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా చేవేళ్లకు చెందిన రాములు(32) కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉస్మానియాలో చేరారు. అతను కూలీ పని చేసుకొని బతుకుతున్నాడు. ఈనెల 2వతేదీన శంషాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద అండరికి చెందిన సూర శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఈనెల 5న బ్రెయిన్ డెడ్ అయ్యారు. సూర శ్రీనివాస్ కుటుంబ సభ్యులను అవయవ దానానికి వైద్య శాఖ మంత్రి, డాక్టర్లు ఒప్పించారు. 60 మంది డాక్టర్లు, సిబ్బంది 11 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి అవయవ మార్పిడి చేశారు. ఒకేసారి మూడు థియేటర్లలో డాక్టర్లు మూడు బృందాలుగా ఏర్పడి శ్రీనివాస్ అవయవాలను ఇద్దరు పేషెంట్లకు మార్పిడి చేశారు. కాక్టర్ సిహెచ్ మధుసూధన్, మనీషాలతో కూడిన వైద్యుల బృందం శస్తచ్రికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఇద్దరు పేషంట్లు ఆరోగ్యంగా ఉన్నారు. ఉస్మానియా వైద్యులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అభినందించారు. ఖరీదైన వైద్యం ప్రభుత్వ ఆస్పత్రిలో విజయవంతంగా, ఉచితంగా చేయడం ద్వారా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేట్టు చేశారని వైద్యులను మంత్రి లక్ష్మారెడ్డి అభినందించారు. పేషంట్లు, వారి కుటుంబ సభ్యులు డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఒకే సమయంలో రెండు అవయవాలను మార్పిడి చేస్తున్న దృశ్యం