తెలంగాణ

పుష్కరాల్లో విషాదం: నీట మునిగి బాలుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఆగస్టు 21 : కృష్ణా పుష్కరాల్లో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాసరాజ్‌పల్లి పుష్కరఘాట్ వద్ద సాగర్ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌లో స్నానం చేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన ముత్తినేని హార్తిక్ (12) నీటిలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం అవుతాపురం గ్రామానికి చెందిన ముత్తినేని లక్ష్మణ్, మంజుల దంపతులు దాదాపు మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీడిమెట్ల కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం లక్ష్మణ్ తన ఇద్దరు కుమారులు హార్తిక్, చిక్కు, తన సోదరుని కుమారులు రాహుల్, రాజేశ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులను తీసుకొని పుష్కర స్నానాల కోసం కారులో నాగార్జునసాగర్‌కు బయలుదేరాడు. నాగార్జునసాగర్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వీరిని కాసరాజ్‌పల్లి ఘాట్‌కు వెళ్ళమని కారును దారి మళ్ళించారు. దీంతో లక్ష్మణ్ పుష్కరస్నానాల కోసం కాసరాజ్‌పల్లికి వచ్చాడు. ఆదివారం కాసరాజ్‌పల్లి ఘాట్‌కు వేల సంఖ్యలో భక్తులు రావడంతో సాగర్‌రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఘాట్ వద్ద భక్తులను పోలీసులు నియంత్రించలేక పోయారు. వందలాది మంది భక్తులు తాత్కాలిక ఘాట్‌కు దూరంగా పుష్కరస్నానాలు ఆచరిస్తుండడంతో లక్ష్మణ్ తన కుమారులతో కలిసి ఘాట్‌కు దూరంగా స్నానాలు చేస్తుండగా కుమారుడు హార్తిక్ నీటిలో ఉన్న గుంతలో పడి మునిగిపోయాడు. హార్తిక్ నీటిలో మునిగిపోవడాన్ని గమనించి గజ ఈతగాళ్ళతో మునిగిన ప్రదేశంలో వెతికి హార్తిక్‌ను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఘాట్ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, వైద్యాధికారి ఉపేందర్ హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకొని బాలున్ని పరీక్షించారు. చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా బాలుడు అప్పటికే మృతి చెందాడు. మృతుడు హార్తిక్ ఆరో తరగతి చదువుతున్నాడు. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.