తెలంగాణ

తొలగిన అటవీ అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: మిషన్ భగీరథకు అటవీ శాఖ నుంచి అడ్డంకులు తొలగిపోయాయి, ఎలక్ట్రికల్ పనుల్లో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ వేగాన్ని పెంచింది. దీంతో ఏప్రిల్ 30 నాటికి హైదరాబాద్ మెట్రో సెగ్మెంట్‌లోని తొమ్మిది నియోజక వర్గాలకు మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీటిని అందిస్తారు. మిషన్ భగీరథలో అటవీ శాఖ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి ఆర్ శోభతో ఆర్‌డబ్ల్యుయస్ ఇఎన్‌సి సురేందర్‌రెడ్డి చర్చించారు.
అటవీ శాఖ పరంగా ఎదురవుతున్న సమస్యలపై చెన్నైలోని ఫారెస్ట్ రీజినల్ ఆఫీస్ ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రజల దాహాన్ని తీర్చే ప్రాజెక్టుకు తమ వంతు సహకారం అందిస్తామని చెన్నైలోని అటవీ అధికారులు తెలిపారు. తొలుత తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని, తరువాత మిగిలిన వాటికి ఇవ్వాలని కోరారు. మింట్‌కంపౌండ్‌లోని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ కార్యాలయానికి వెళ్లి చైర్మన్, ఎండి రఘుమారెడ్డితో బి సురేందర్‌రెడ్డి చర్చించారు.
హైదరాబాద్ మెట్రో సెగ్మెంట్‌లోని తొమ్మిది నియోజక వర్గాలకు కావలసిన విద్యుత్ అనుమతులపై చర్చించారు. ప్రాజెక్టుకు కావలసిన విద్యుత్ డిమాండ్, సబ్ స్టేషన్లు, లైన్లవిషయంలో ఇప్పటికే అన్ని రకాల పనులు పూర్తి చేశామని రఘుమారెడ్డి తెలిపారు. సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్‌లు పూర్తి చేస్తామని అన్నారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై శుక్రవారం సచివాలయంలో పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.