తెలంగాణ

‘వ్యాపారమూ.. సేవారంగమే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఆగస్టు 21: వ్యాపారాలు లాభాల కోసం చేసేవే అయినా ప్రజలకు వివిధ రకాల వస్తుసేవలను అందిస్తున్నందున వ్యాపారాన్ని సేవారంగంగా భావించాలని తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం నిర్వహించిన మర్చంట్స్‌డే కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిధిగా హాజరై ప్రసంగించారు. వ్యాపారరంగం పురాతనకాలం నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోను కొనసాగుతున్న వ్యవస్థని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు అంటే రైతుల ఉత్పత్తిని ఖరీదుచేసే వారని అలా ప్రారంభమైన ఈ రంగం మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులతో వివిధ రంగాలకు విస్తరించిందన్నారు. వ్యాపార రంగంలో పోటీతత్వం తీవ్రంగా ఉంటుందని, ఇది దుష్పరిణామాలకు దారితీయకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. వ్యాపారులు అధిక లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో వ్యాపారాలు కొనసాగించాలన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న చట్టాల వల్ల కొన్నిసార్లు వ్యాపారాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతుంటాయని, అలాంటి సమయంలో వాటిని సంఘటితంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. వ్యాపారవర్గాలను సంఘటితం చేసేలా మర్చంట్స్‌డే కార్యక్రమాన్ని సూర్యాపేట నుండి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాపారులకు అండగా నిలుస్తూ వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపడుతున్నారని చెప్పారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వ్యాపారుల వేధింపులను అరికట్టేలా చూస్తున్నామన్నారు.
వ్యాపార దినోత్సవ కార్యక్రమాన్ని
ప్రారంభిస్తున్న తమిళనాడు గవర్నర్ రోశయ్య