తెలంగాణ

ఎటు చూసినా ప్రభం‘జనమే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: కృష్ణాపుష్కరాలకు జనం బారులు తీరడంతో కృష్ణమ్మ పులకిస్తోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అన్నిఘాట్‌లు జనసందోహంతో కిక్కిరిసిపోతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది ప్రారంభమయ్యే తంగడి మొదలుకుని నల్లగొండ జిల్లా మట్టపల్లి వరకు ఏర్పాటు చేసిన దాదాపు 90 ఘాట్లు జనం ఇసుకవేస్తేరాలనంత విధంగా మారాయి. ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో కలిపి లక్షలాది సంఖ్యలో పుష్కరస్నానాలు చేశారని సమాచారం అందింది. ఆదిపుష్కరాలు ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు పదిరోజులు గడిచాయి. పూర్తయ్యేందుకు మరో రెండురోజుల గడవు మాత్రమే ఉంది. దాంతో భక్తజనం లక్షలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 30 లక్షల మందికిపైగా స్నానాలు చేశారని తెలిసింది.
ప్రతిఒక్కరిలో పుష్కరాలకు వెళదాం అన్న ఆలోచన రావడంతో కృష్ణానదికి జనం తాకిడి అధికంగా కొనసాగుతోంది. తెలంగాణకు చెందిన జిల్లాల నుండే కాకుండా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల నుండి కూడా జనం కృష్ణాతీరానికి తరలి వస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణాబ్రిడ్జి, బీచుపల్లి, ఆలంపూర్, రంగాపూర్, జటప్రోల్, సోమశిల, మల్లేశ్వరం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, అడవిదేవులపల్లి, మట్టపల్లి, వాడపల్లి తదితర ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. పుష్కరస్నానం చేస్తున్న వారు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడం, సమీప దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పుష్కరస్నానాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అందరిమన్ననలను పొందుతున్నాయి. స్వల్పమైన సంఘటనలు మినహాయిస్తే మొత్తంమీద పుష్కరాలు సజావుగా సాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దేవాదాయ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీశ్వరరెడ్డి తరచూ పుష్కరఘాట్లకు వెళ్లి సమీక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం నిరంతరపర్యవేక్షణ కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ ఇతర అధికారులు తమదృష్టిని పుష్కరాలపైనే కేంద్రీకరించారు. అలాగే నల్లగొండ జిల్లాలో కూడా జిల్లాకలెక్టర్, ఎస్‌పి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారులు నిరంతరం భక్తుల సేవలో తరిస్తున్నారు. భక్తులు పితృతర్పణాలు విడిచేందుకు అవసరమైన వస్తువులను ఒక కిట్‌గా రూపొందించి 150 రూపాయలకు అందిస్తున్నారు. అలాగే కార్యక్రమం నిర్వహించే బ్రాహ్మణుల ఫీజును 250 రూపాయలుగా నిర్ణయించారు. అన్నిఘాట్ల వద్ద కూడా దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహకారంతో అనేక సంస్థలు ఉచితభోజన సౌకర్యం కల్పించాయి. భక్తులు ఎక్కడ కూడా ఇబ్బందికి గురికాకుండా జిల్లా యంత్రాంగాలు చూస్తున్నాయి. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు విభాగం పెద్దఎత్తున పోలీసు సిబ్బందిని నియమించింది.

మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి పుష్కర ఘాట్‌లో వెల్లువెత్తిన భక్తులు

మహబూబ్‌నగర్ జిల్లా సోమశిలలో ద్విచక్ర వాహనంపై వెళ్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు