తెలంగాణ

మహిపాల్ అనర్హతపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: మెదక్ జిల్లా పటాంచెర్వు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనర్హతకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసుపై సమగ్రమైన వాదనలు వినకుండా, విచారణ జరపకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. బిజెపి నేత రఘునందనరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. సంగారెడ్డి కోర్టు ఒక కేసులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి శిక్ష విధించిందని, అనర్హత వర్తిస్తుందని, ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ కింది కోర్టు తీర్పును సస్పెండ్ చేస్తూ పైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. అనంతరం బెంచ్ ఈ కేసు విరణను జనవరి మూడవ వారానికి వాయిదా వేసింది.
రహీం వైద్య ఖర్చులు
ప్రభుత్వమే భరిస్తుంది: సిఎం
హైదరాబాద్, జనవరి 7: అనారోగ్యంతో బాధపడుతున్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం ఖురేషి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించి, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎపి పౌరసరఫరాలో డిపిసి పునర్వ్యవస్థీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7: ఆంధ్ర ప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో ప్రథమ, ద్వితీయ శ్రేణి గెజిటెడ్ ఆఫీసర్ల ప్రమోషన్ల వ్యవహారంపై పరిశీలన చేసేందుకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటి (డిపిసి) ని పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు ప్రభుత్వ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి సివిల్ సప్లైస్ కమిషనర్ మెంబర్-కన్వీనర్‌గా ఉంటారు. లీగల్ మెట్రాలజీ కంప్ట్రోలర్,కన్స్యూమర్ అఫైర్స్ ఎక్స్-అఫీషియో జాయింట్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండేళ్లపాటు పనిచేస్తుంది. కమిటి గడువు 2017 నవంబర్ 25 వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.